Pawan Kalyan : అడుగేస్తే తప్పు.. నడిస్తే తప్పు.. కారులో వెళ్లినా.. పైన కూర్చున్నా తప్పు.. జనంలోకి వస్తే తప్పు.. పవన్ కళ్యాణ్ కొత్త ప్రచార రథం రంగు తప్పు.. కనీసం ఆయన వేసుకునే చొక్కానైనా అనుమతిస్తారా? ఇప్పుడే పవన్ కళ్యాణ్ ఆవేదన ఆగ్రహానికి కారణమవుతోంది. పవన్ కళ్యాణ్ ఇటీవలే పరిచయం చేసిన కొత్త ప్రచార రథం ‘వారాహి’కి మిల్ట్రీ వాహనాలకు వేసే రంగు ఉండడాన్ని వైసీపీ తప్పుపడుతోంది. ప్రతీదాన్ని రాజకీయం చేస్తోంది. అందుకే పవన్ లోని ఆవేశం కట్టలు తెంచుకుంది..

తాజాగా పవన్ కళ్యాణ్ ట్వీట్ చేస్తూ కడిగిపారేశాడు.. ‘‘ మొదట ఈ వైసీపీ వాళ్లు నా సినిమాలను ఆపేశారు.. విశాఖపట్నంలో నన్ను వాహనం & హోటల్ గది నుండి బయటకు రానివ్వలేదు.. నన్ను నగరం వదిలి వెళ్ళమని నోటీసులు ఇచ్చారు. మంగళగిరిలో మీరు నా కారు నుంచి బయటకు వెళ్లనివ్వలేదు, తర్వాత నన్ను కనీసం నడవనివ్వలేదు.. ఇప్పుడు నా ప్రచార రథం రంగు సమస్యగా మారింది. కనీసం నన్ను నేను ఊపిరి తీసుకోనిస్తారా? పీల్చకుండా చేస్తారా?’ అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేసి నిప్పులు చెరిగారు.
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ.. ప్రతిపక్ష జనసేనను టార్గెట్ చేస్తోంది. ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పై ఆంక్షల పరంపర కొనసాగిస్తోంది. ప్రజాస్వామ్యంలో ఏ వ్యక్తికైనా.. పార్టీకైనా తన ప్రచారం తను చేసుకునే హక్కు ఉంటుంది. కానీ ఇక్కడ వైసీపీ నియంతగా వ్యవహరిస్తూ జనసేనను కట్టడి చేయాలని చూస్తోంది. ఇందులో భాగంగానే అడుగడుగునా ఆంక్షలు విధిస్తోంది. ఏం చేసినా రాజకీయం చేస్తూ తప్పు పడుతోంది.
1st you have stopped my films; in Visakhapatnam U didn’t let me come out of the vehicle & hotel room & forced me to leave the city. In Mangalagiri U didn’t let my car go out,then didn’t let me walk & now the color of vehicle has become an issue.OK,shall I stop breathing?? Next..
— Pawan Kalyan (@PawanKalyan) December 9, 2022
పవన్ కళ్యాణ్ ప్రతీ స్టెప్ ను వైసీపీ తప్పుపడుతోంది. అసలు ఇది ఏపీనా? పాకిస్తాన్ నా అన్న రీతిలో వైసీపీ పాలన సాగిస్తోంది. మన స్వేచ్ఛపూరిత భారత్ లోనే ఉన్నామా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి. జనసేనను ఏదో విధంగా అడ్డుకుంటూ ఆ పార్టీని తొక్కేయాలని వైసీపీ చూస్తోంది. కానీ ఎంత తొక్కేసినా పడిలేచిన కెరటంలా జనసేన ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. దాన్ని తట్టుకోలేకనే వైసీపీ బ్యాచ్ ఈ కుట్రలు, కుతంత్రాలకు తెరతీస్తోంది. ఎంత తొక్కేయాలని చూసినా రోజురోజుకు జనసేన బలోపేతం అవుతోంది. వచ్చే ఎన్నికల్లో జనసేన తమకు పోటీ ఇస్తుందనే ఉద్దేశంతో ఇప్పటి నుంచే దాన్ని ఒత్తిడికి గురి చేయాలనే ఉద్దేశంతోనే వైసీపీ ఈ నాటకాలు ఆడుతోంది.
తాజాగా పవన్ కల్యాణ్ ప్రచార రథం ‘వారాహి’ వాహనంపై కూడా వైసీపీ తప్పుపట్టడం అందరినీ విస్తుగొలిపేలా చేసింది. పవన్ కల్యాణ్ వాడే వాహనం మిలటరీ వాహనాల రంగులో ఉందని వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇది మోటార్ వెహికల్ చట్టం ప్రకారం తప్పు అంటూ ఆక్షేపిస్తోంది. వైసీపీ నేతలు వాహనం రంగును కూడా వదలకుండా మాట్లాడటం వివాదాలకు కారణమవుతోంది. ప్రచార రథం రంగు అనేది ఆయా పార్టీల ఇష్టం. పవన్ కళ్యాణ్ కు దేశభక్తి ఎక్కువ కనుక సైన్యానికి వాడే రంగును అభిమానంతో వేసుకున్నాడు. ఎవరి అభీష్టం మేరకు వారు తమ వాహనాలను డిజైన్ చేయించుకుంటుంటారు. ఇందులో భాగంగానే పవన్ కల్యాణ్ తన వాహనానికి ఆర్మీ వాహనాల రంగు వేసుకున్నారు. పవన్ కు వస్తున్న మైలేజ్ చూసి వైసీపీ నేతలు తట్టుకోలేకపోతున్నారు. అందుకే వాహనాల రంగుపై కూడా రాద్ధాంతం చేస్తున్నారు. ఏపీలో వైసీపీ నేతల తీరు విమర్శలకు కారణమవుతోంది.

ఇన్ని ఆంక్షలు విధిస్తున్నా.. పవన్ కల్యాణ్ ను అడ్డుకోవాలని చూస్తున్నా ఆయన వెనక్కి తగ్గడం లేదు. ప్రశ్నిస్తూనే ఉన్నారు. తాజాగా ట్విటర్ లోనూ ‘ఆర్మీ రంగులోని చొక్కాను షేర్ చేసి.. కనీసం దీన్నైనా వేసుకొనిస్తారా వైసీపీ నేతలు?’ అంటూ ప్రశ్నించాడు. అడుగడుగునా తనను అడ్డుకుంటున్న వైనాన్ని ఎండగట్టాడు. పవన్ కల్యాణ్ చేసే పనులకు వైసీపీ నేతలు మాటిమాటికి అడ్డు తగలడం ఇప్పటికైనా మానుకోవాలని.. ప్రజా సమస్యలపై దృష్టి సారించాలని పలువురు హితవు పలుకుతున్నారు.