ఏ హీరోకి అయినా కేవలం అభిమానులు మాత్రమే ఉంటారు, కానీ ఆయనకు మాత్రం భక్తులు ఉన్నారు. కొంతమంది యంగ్ హీరోలు అయితే.. ఆయన కోసం ఏం చేయడానికైనా రెడీ, ఆయన అంటే మాకు ప్రాణం’ అంటూ తెగ సొల్లు కబుర్లు చెబుతూ ఉంటారు. ఇక బండ్ల గణేష్ లాంటి నిర్మాతలు అయితే.. ఆయన్ని ఏకంగా దేవుడ్ని చేసేస్తారు. ఆయనే పవన్ కళ్యాణ్.

మరి ఆ దేవుడ్ని అడ్డమైన తిట్లు తిడుతూ అతి దారుణంగా అవమానిస్తుంటే.. ఈ యంగ్ హీరోలు, ఈ భక్తులు ఏమి పీకుతున్నట్లు ? అంటే.. సొల్లు కబుర్లు.. స్టేజ్ మీద బిస్కెట్లు వేయడం తప్ప.. వీరంతా ఎందుకు పనికి రారా ? కనీసం ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా మాట్లాడుతూ ఒక్క బైట్ కూడా ఎందుకు వదలలేకపోయారు ?
బైట్ వదలడానికి కూడా దైర్యం లేదా ? అదే సినిమా ఫంక్షన్స్ లో, ఇంటర్వ్యూల్లో మాత్రం పవన్ కళ్యాణ్ స్థానం వేరు.. పవన్ కళ్యాణ్ స్థాయి వేరు’ అంటూ ఎప్పటిలాగే రెగ్యులర్ బిల్డప్ మాటలు చెప్పి.. నాలుగు లైక్ లు రెండు షేర్ లు తెచ్చుకుంటారు.
ఇప్పటికీ ఆశ్చర్యం కలిగించే అంశం ఏమిటంటే.. ? ఒకప్పుడు కత్తి మహేష్, శ్రీరెడ్డి లాంటి వాళ్ళు పవన్ పై విమర్శలు చేస్తే.. ఇదే యంగ్ హీరోలు వారి పై విరుచుకుపడ్డారు. మరి ఇప్పుడు ఏపీ మంత్రులు, చివరకు పోసాని లాంటి కమెడియన్లు పవన్ పై దారుణమైన ఆరోణలు చేస్తుంటే.. ఏరీ ఈ భక్తులంతా ? ఎందుకు ముందుకు రావడం లేదు ?
ఒక్కరు కూడా పవన్ కళ్యాణ్ తరఫున మాట్లాడటానికి ఆసక్తి చూపించలేదు అంటే.. పవన్ కి ఎంత అవమానం ? నిత్యం పవన్ చుట్టూ ఓ గుంపు ఉంటుంది కదా ? వారంతా ఇంకా అజ్ఞాతంలోనే ఎందుకు ఉండిపోయారు ? ఎక్కడైనా వెన్నపోటు పొడిచే వాళ్ళు ఉంటారు, కానీ భక్తి పేరుతో పూజలు చేసి.. చివరకు ప్రసాదం మొత్తం దొంగిలించి పారిపోయినట్టు ఉంది వీరి పరిస్థితి.
ఇప్పటికైనా పవన్ మారాలి. ఎదురుగా జేజేలు పలుకుతారు, వెనుకాల మరొకరి పంచన చేరతారు. ఏ..? నిన్న ‘మంత్రి పేర్ని నాని’ పవన్ ను ఉద్దేశించి.. ‘ఆ నా కొడుకు’ అంటూ బూతులు తిడుతుంటే.. పక్కన దిల్ రాజు ఏమి చేస్తోన్నట్లు ? కనీసం మంత్రికి ఎదురుచెప్పలేకపోయినా.. ఆ మీటింగ్ నుంచి లేచి పక్కకి వెళ్లొచ్చు కదా..!
పైగా దిల్ రాజు, మంత్రి పక్కనే కూర్చుని చిరునవ్వులు చిందించాడు ? ఒక్క దిల్ రాజే కాదు, పవన్ భక్తుల్లో నితిన్ ఏమైపోయాడు ? బండ్ల గణేష్, నిఖిల్, ఇలా చాలామంది హీరోలు, అన్నిటికి మించి మెగా హీరోలు, ఇంకా అనేకమంది సినీ ప్రముఖుల ఏమైపోయారు ? విజయవంతంగా పవన్ కళ్యాణ్ కి వెన్నుపోటు పొడిచారు.