Pawan Kalyan : అధికారంలో ఉంటే ఒక రాచరికం అనుకుంటున్నారేమో అర్థం కానీ పరిస్థితి. ఏపీలో అయితే జనసేన ఉనికినే వైసీపీ తట్టుకోవడం లేదు. అస్సలు జనసైనికులను సహించడం లేదు. కనీసం జెండా గద్దెలు కూడా పెట్టుకోవడానికి జనసేనకు అనుమతించడం లేదంటే ఏపీలో ప్రభుత్వ వ్యవస్థ ఎంత భయపడుతుందో అర్థం చేసుకోవచ్చు. పవన్ కళ్యాణ్ అన్నా.. జనసేన అన్నా వైసీపీ సర్కార్ భయపడుతున్న పరిస్థితి నెలకొంది.

తాజాగా విజయవాడ పశ్చిమ, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో జనసేన పార్టీ జెండా ఆవిష్కరణలను వైసీపీ వర్గాలు అడ్డుకున్న తీరే ఇందుకు ఉదాహరణ. జనసేన అంటే వైసీపీ నేతలు ఎంత భయపడుతున్నారో దీని ద్వారా అర్థం అవుతోంది. విజయవాడలో రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేష్ కు జనసేన జెండా ఆవిష్కరించకుండా అడ్డుకోవడాన్ని పవన్ కళ్యాణ్ ఖండించారు. జనసేన జెండా దిమ్మెను వైసీపీ శ్రేణులు అర్ధరాత్రి కూల్చడాన్ని తూర్పారపట్టారు. జెండా గద్దెలు కూల్చిన వారిని వదిలిపెట్టి ప్రశ్నించిన జనసైనికులపై కేసులు పెట్టడం ఎంత వరకూ సమంజసం అని పోలీసులను ప్రశ్నించారు.

జనసేన తలపెట్టిన ప్రతీ కార్యక్రమానికి అనుమతివ్వడం లేదు వైసీపీ సర్కార్. ఆఖరుకు జెండా గద్దెల నిర్మాణం, పతాకావిష్కరణకు ఇంతలా భయపడుతున్నారంటే ఓటమి భయం వారిని వెంటాడుతున్నట్టే లెక్క. పోలీసులు వైసీపీ సర్కార్ లో ఇంత అమానుషంగా ప్రవర్తించడాన్ని పవన్ ప్రశ్నించారు. మరో పార్టీ అధికారంలోకి వస్తే ఇదే పోలీసులు తలదించుకునే పరిస్థితి రాకూడదని ఆయన హెచ్చరించారు.
జనసేనను ఇలానే అడ్డుకుంటే రోడ్డు మీదకు రావాల్సి వస్తుందని.. పరిస్థితి ఇలాగే కొనసాగితే తాను రోడ్డెక్కక తప్పదని పవన్ కళ్యాణ్ హెచ్చరించారు. పవన్ కళ్యాణ్ రోడ్డెక్కితే ఆ అశేష జనసమూహాన్ని కట్టడి చేయడం జగన్ సర్కార్ వల్ల కాదు.. పోలీసులతో అంతకంటే కాదు. అందుకే జనసేనపై ఈ కక్షసాధింపు చర్యలు ఆపుతారా? లేదా తనను రోడ్డెక్కమంటారా? అని పవన్ ప్రశ్నిస్తున్నారు. అదే జరిగితే వైసీపీ సర్కార్ కు దిమ్మదిరిగి బొమ్మ కనపడుతుంది. అక్కడి వరకూ తెచ్చుకుంటారా? లేదా? అన్నది చూడాలి.
జనసేనకు ఇంతలా భయపడుతున్న వైసీపీ సర్కార్ కు నూకలు చెల్లినట్టేననే అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఎప్పుడైతే భయపడుతారో అప్పుడే ఓటమి భయం ఆవహిస్తోందని అర్థం. అధికారం అడ్డుపెట్టుకొని వైసీపీ ఎంతగా జనసేనను తొక్కేస్తున్నా.. జనసైనికులు అంతే తీవ్రతతో ఎగిసిపడుతున్నారు. ఆ జ్వాలల్లో వైసీపీ అంటుకోవడం ఖాయమంటున్నారు.
[…] Also Read:Pawan Kalyan : పవన్ కళ్యాణ్ రోడ్డెక్కితే జగన్ … […]