KCR: తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు బాంబు పేల్చడానికి కేసీఆర్ రెడీ అయినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ప్రకటనపై ఉత్కంఠ నెలకొంది. కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళ్లబోతున్నారని.. అసెంబ్లీ రద్దుకు యోచిస్తున్నారని సమాచారం.

ఎందుకంటే ఈరోజు 2 గంటలకు కేబినెట్ భేటి పెట్టిన కేసీఆర్.. సాయంత్రం టీఆర్ఎస్ శాసనసభా పక్ష మీటింగ్ పెట్టారు. దీంతో అసెంబ్లీ రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లడానికి కేసీఆర్ రెడీ అవుతున్నట్టు పరిణామాలను బట్టి తెలుస్తోంది.
బీజేపీ రోజురోజుకు తెలంగాణపై దండయాత్రకు రావడం.. ఇరుకున పెడుతుండడంతో ఇక ప్రజల్లోనే తేల్చుకోవడానికి కేసీఆర్ రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అసెంబ్లీ రద్దు చేసి ఎన్నికలకు వెళ్లి బీజేపీతో తాడోపేడో తేల్చుకోవడానికి సిద్ధమైనట్లు విశ్వసనీయ సమాచారం. ఈ సాయంత్రం 7 గంటలకు మీడియా సమావేశంలో ఇదే ప్రకటించబోతున్నట్టు తెలుస్తోంది.
ఇక దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ వెళ్లేందుకు కూడా డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. ఈ మేరకు కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు తెలిసింది. అదీ ఈరోజే ప్రకటించడానికి రెడీ అయినట్టుగా సమాచారం.
తెలంగాణలో విమోచన దినోత్సవాన్ని కూడా కేసీఆర్ అధికారికంగా చేయడానికి నిర్ణయించినట్టు తెలిసింది. తద్వారా బీజేపీకి కౌంటర్ ఇవ్వాలని గట్టిగా నిర్ణయించుకున్నట్టు తెలిసింది.
నిన్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో పర్యటించి కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేశారు. ఇవాళ మరో కేంద్రమంత్రి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటించి కేసీఆర్ సర్కార్ పై దుమ్మెత్తి పోశారు. కేంద్రంలోని బీజేపీ పెద్దలంతా తెలంగాణపై దాడిని తీవ్రతరం చేయడంతో దీన్ని ఎదుర్కోవడానికి కేసీఆర్ ‘ముందస్తు ఎన్నికలకు ’ వెళ్లబోతున్నారని సమాచారం అందుతోంది.
మరికొద్దిసేపట్లోనే కేసీఆర్ సంచలన ప్రెస్ మీట్ నిర్వహించబోతున్నారని.. కేంద్ర మంత్రులకు కౌంటర్ ఇవ్వడంతోపాటు ‘అసెంబ్లీ రద్దు చేసి ముందస్తుకు వెళ్లబోతున్నారని తెలుస్తోంది.