Telangana BJP : పార్లమెంట్ ఎన్నికల నాటికి తెలంగాణలో బీజేపీ పరిస్థితి ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఇంకా మూడు నాలుగు నెలలు మాత్రమే ఎన్నికలకు సమయం ఉంది. మొన్నటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పరిస్థితి ఏంటన్నది విశ్లేషిద్దాం
కేవలం 15 శాతం పైన వచ్చిన నియోజకవర్గలు చూస్తే 22 నియోజకవర్గాలు మాత్రమే. ఎటు చూసినా 50 నియోజకవర్గాలకు మించి బీజేపీకి బలం లేదు. ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, హైదరాబాద్ లో మాత్రమే బీజేపీకి బలం ఉందని ఎన్నికల్లో తేలింది. గెలిచిన సీట్లన్నీ అక్కడే కావడం గమనార్హం. కామారెడ్డిలాంటి ఒకటిరెండు చోట్ల అభ్యర్థులను చూసి గెలిపించారు.
దక్షిణ తెలంగాణలో ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, వరంగల్ లో అసలు బీజేపీ నామమాత్రంగా ఉంది. ఓట్ల శాతం 7-14 శాతం వరకూ ఉంది. పార్లమెంట్ ఎన్నికల నాటికి ఈ ఓట్ల శాతం పెరుగుతుందా? అన్నది వేచిచూడాలి.
పార్లమెంట్ ఎన్నికలు తెలంగాణ బీజేపీకి అగ్నిపరీక్షగా మారడం ఖాయమని.. దీనిపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.