Harish Shankar- Ravi Teja Combo : ప్రస్తుతం హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ తో సినిమా చేస్తున్నాడు. అయినప్పటికీ పవన్ కళ్యాణ్ ఏపీ పాలిటిక్స్ లో బిజీగా ఉండడం వల్ల హరీష్ శంకర్ ఈ గ్యాప్ లో రవితేజ తో ఒక సినిమా చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇప్పటికే రవితేజ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో రావాల్సిన ఒక సినిమా బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఆ సినిమా పోస్ట్ పోన్ అయింది. ఇక దాంతో ప్రస్తుతం రవితేజ ఖాళీగా ఉండటంతో హరీష్ శంకర్ కథ చెప్పి రవితేజను ఒప్పించినట్టుగా తెలుస్తుంది.
ఇక వీళ్ళ కాంబో లో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి షాక్ కాగా, మరొకటి మిరపకాయ్. అందులో షాక్ సినిమా పెద్దగా ఆడకపోయినప్పటికీ మిరపకాయ్ సినిమాతో ఇద్దరు మంచి సక్సెస్ ని అందుకున్నారు. ఇంకా ఇప్పుడు మిరపకాయ్ హిట్ ని రిపీట్ చేయడానికి మరొకసారి వీళ్ళిద్దరూ కలిసి పనిచేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే హరీష్ శంకర్ చెప్పిన కథ చాలా అద్భుతంగా ఉందని రవితేజ చెప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ కథలో రవితేజ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నట్టుగా వార్తలైతే వస్తున్నాయి. నిజానికి మిరపకాయ్ సినిమాలో కూడా రవితేజ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. ఇప్పుడు కూడా ఈ సినిమాలో తను పోలీస్ ఆఫీసర్ గా కనిపించి మెప్పించబోతున్నట్టుగా తెలుస్తుంది.
ఇక ఈ సినిమా సంక్రాంతి తర్వాత పట్టలేకబోతున్నట్టుగా వార్తలు కూడా వస్తున్నాయి. సంక్రాంతి నుంచి ఎలక్షన్స్ అయిపోయే సమయానికి ఇంకొక మూడు, నాలుగు నెలల సమయం ఉండడంతో ఈ మూడు నాలుగు నెలల్లో ఈ సినిమాని పూర్తి చేసి పవన్ కళ్యాణ్ ఫ్రీ అయ్యే సమయానికి మళ్ళీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మీదకి హరీష్ శంకర్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే రవితేజ అభిమానులు మాత్రం హరీష్ శంకర్ తో రవితేజ సినిమా చేస్తుంటే చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ అభిమానులు మాత్రం మళ్లీ మధ్యలో రవితేజతో సినిమా చేయడం ఎందుకు ఉస్తాద్ భగత్ సింగ్ మీదనే మరికొంత ఫోకస్ పెడితే బాగుంటుంది కదా ఈ గ్యాప్ లో ఏమన్నా మిస్టేక్స్ ఉంటే వాటిని సరిచేసుకొని ఉస్తాద్ భగత్ సింగ్ ని ఇంకా కొంచెం బాగా చేసి ఉంటే బాగుండేది కదా అని వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.
కానీ ఇప్పటికే పవన్ కళ్యాణ్ ని నమ్ముకొని హరీష్ శంకర్ దాదాపు నాలుగు సంవత్సరాలు టైమును వేస్ట్ చేశాడు. తను చివరగా గద్దల కొండ గణేష్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు అప్పటినుంచి ఇప్పటివరకు ఒక్క సినిమాను కూడా రిలీజ్ చేయలేదు. దాంతో ఆయన కూడా చాలా నిరాశకి గురవుతున్నట్టుగా తెలుస్తుంది. అందుకే అతను సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్టుగా తెలుస్తుంది..