Pakistan : పాకిస్తాన్ బద్దలయ్యే సమయం ఆసన్నమైంది

పాకిస్తాన్ బద్దలయ్యే సమయం ఆసన్నమైంది.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.

Written By: NARESH, Updated On : February 20, 2024 4:06 pm

Pakistan : పాకిస్తాన్ మొట్టమొదటి సారి 1971 తర్వాత మరోసారి బద్దలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంతకుముందు బయట నుంచి ప్రమాదం ఉందని అనుకున్నాం.. ఖైబర్ ఫక్తూన్ అప్ఘన్ లో కలుస్తుందని అనుకున్నాం.. బెలూచిస్తాన్ ప్రాంతం వాసులు సుదీర్ఘకాలంగా స్వాతంత్ర్య పోరాటం చేస్తున్నారు.. వారికి అవకాశాలు ఉన్నాయని అనుకుంటున్నారు.

తాజాగా పాకిస్తాన్ లోని అత్యంత కీలకమైన ప్రాంతం పంజాబ్ లోనే అంత్యర్థుద్ధం సూచనలు కనిపిస్తున్నాయి. ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికలు చూస్తే పచ్చి బూటకం అని పాకిస్తాన్ ప్రజలు నమ్ముతున్నారు.

పాకిస్తాన్ లో ఎన్నికలను కంట్రోల్ చేసేది ఆర్మీ. ఎవరు చెప్తే వారే ప్రధాని.. ఇమ్రాన్ ఖాన్ ను ఇదే ఆర్మీ పెంచి పోషించి ప్రధానిని చేసింది. ఆయనతో గొడవలతో తీసేసి లండన్ నుంచి నవాజ్ షరీఫ్ ను తీసుకొచ్చి పెట్టింది. ఇప్పుడు అనుకోకుండా ప్రజలు తిరుగుబాటు చేశారు. సైన్యం మీదనే ఈ తిరుగుబాటు జరిగింది. ఆర్మీకి వ్యతిరేకంగా ప్రజలు తిరుగబడ్డారు.

ఇమ్రాన్ ఖాన్ పార్టీకి ఆర్మీ సింబల్ తీసేసింది. స్వతంత్రులు ఎవరికి వారే సింబల్ చేసుకొని పోటీచేసి 100కు పైగా గెలిచారు. రిగ్గింగ్ చేయకుంటే ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోనే ప్రభుత్వం ఏర్పడేది. కానీ ఆర్మీ రిగ్గింగ్ తో హంగ్ వచ్చేసింది.

పాకిస్తాన్ బద్దలయ్యే సమయం ఆసన్నమైంది.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.