Mahesh Babu: మహేష్ బాబు ఆ స్టార్ ప్రొడ్యూసర్ ను పక్కన పెట్టడానికి కారణం ఏంటి..?

ఎమ్మెస్ రాజు కూడా ఈ సినిమాతో ఒక భారీ బ్లాక్ బస్టర్ ని దక్కించుకొని స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్నాడు. అయితే దీనికి ముందే ఆయన ఉదయ్ కిరణ్ తో మనసంతా నువ్వే లాంటి సూపర్ హిట్ సినిమాను తీసి మంచి ఫామ్ లో ఉన్నాడు.

Written By: Gopi, Updated On : February 20, 2024 3:38 pm
Follow us on

Mahesh Babu: సూపర్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పాటు చేసుకున్న మహేష్ బాబు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో తనకంటూ ప్రత్యేకతను ఏర్పాటు చేసుకోవడమే కాకుండా ముందుకు దూసుకెళ్తున్నాడు. అయితే ఇండస్ట్రీకి వచ్చిన మొదట్లో మహేష్ బాబు కొన్ని సినిమాలు చేసినప్పటికీ ఆయనకి భారీ సక్సెస్ లు మాత్రం దక్కలేదు. మురారి సినిమా హిట్ అయినప్పటికీ బ్లాక్ బస్టర్ హిట్ గా మాత్రం మరలేకపోయింది. ఇక తను చేసిన ఏడోవ సినిమా అయిన ఒక్కడు సినిమాతో ఆయనకి కెరియర్ లో మొదటి బ్లాక్ బస్టర్ హిట్టు దక్కింది.

అయితే ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన ఎమ్మెస్ రాజు కూడా ఈ సినిమాతో ఒక భారీ బ్లాక్ బస్టర్ ని దక్కించుకొని స్టార్ ప్రొడ్యూసర్ గా పేరు సంపాదించుకున్నాడు. అయితే దీనికి ముందే ఆయన ఉదయ్ కిరణ్ తో మనసంతా నువ్వే లాంటి సూపర్ హిట్ సినిమాను తీసి మంచి ఫామ్ లో ఉన్నాడు. ఇక ఒక్కడు సినిమా తర్వాత వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా, పౌర్ణమి లాంటి సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. అయితే మహేష్ బాబుతో ఒక్కడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తీసిన ఆయన ఆ తర్వాత మహేష్ బాబు తో మరో సినిమా చేయలేకపోయాడు.

దీనికి కారణం ఏంటంటే, ఎమ్మెస్ రాజు నావల్లే మహేష్ బాబు కి ఒక బ్లాక్ బాస్టర్ హిట్టు వచ్చింది అంటూ ఇండస్ట్రీలో ఉన్న చాలా మందితో చెప్పాడట. అది నచ్చక మహేష్ బాబు ఆయనతో మరో సినిమా చేయలేదు ఎందుకంటే ఒక హీరో ఒక సినిమా చేసినప్పుడు అది హిట్ అయిన ఫ్లాప్ అయినా అందరికీ సమానమైన క్రెడిట్ దక్కుతుంది. ముఖ్యంగా దర్శకుడికి, హీరోకి అయితే భారీ క్రెడిట్ ఇవ్వాలి. అలా కాకుండా ఒక ప్రొడక్షన్ హౌస్ కి ఎక్కువ క్రెడిట్ ఇవ్వడం అనేది మహేష్ బాబు కి నచ్చలేదు. అందువల్లే ఒక్కడు లాంటి సూపర్ డూపర్ హిట్ ఇచ్చిన గుణశేఖర్ తో మరో రెండు సినిమాలు చేశాడు గాని, ఎమ్మెస్ రాజు ప్రొడక్షన్ లో మాత్రం మరొక సినిమా చేయలేదు.