Operation Valentine Official Trailer : మెగా హీరో వరుణ్ తేజ్ కెరీర్ బిగినింగ్ నుండి ప్రయోగాత్మక చిత్రాలు ఎంచుకుంటూ ప్రత్యేకత చాటుకుంటున్నాడు. తక్కువ సమయంలో వరుణ్ తేజ్ డిఫరెంట్ జోనర్స్ ట్రై చేశాడు. సైన్స్ ఫిక్షన్, పీరియాడిక్ జోనర్స్ కూడా ఆయన టచ్ చేశారు. ఈసారి వరుణ్ తేజ్ వార్ నేపథ్యంలో సాగే పేట్రియాటిక్ సబ్జెక్టు ఎంచుకున్నాడు. ఆపరేషన్ వాలెంటైన్ మూవీ భారత వైమానిక దళం సాహసాల నేపథ్యంలో తెరకెక్కింది. వరుణ్ తేజ్ యుద్ధ విమానాలను నడిపే పైలట్ రోల్ చేశాడు. ఆపరేషన్ వాలెంటైన్ విడుదలకు సిద్ధం కాగా ట్రైలర్ రిలీజ్ చేశారు.
రెండున్నర నిమిషాలకు పైగా ఉన్న ట్రైలర్ ఉత్కంఠగా సాగింది. ఆకాశంలో యుద్ధ విమానాల సాహసాలు, విజువల్స్ అబ్బురపరిచాయి. వరుణ్ తేజ్ క్యారెక్టరైజేషన్ అద్భుతంగా ఉంది. దేశభక్తి గుండెలనిండా కలిగిన పైలట్ గా వరుణ్ చక్కగా కుదిరాడు. ఆయన ఆహార్యం రోల్ కి సెట్ అయ్యింది. హీరోయిన్ మానుషీ చిల్లర్ రాడార్ రూమ్ లో కూర్చుని పైలట్స్ ని గైడ్ చేసే ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్ గా చేస్తుంది.
ఉన్నత నిర్మాణ విలువలతో ఆపరేషన్ వాలెంటైన్ తెరకెక్కినట్లు విజువల్స్ చూస్తుంటే అర్థం అవుతుంది. ఆపరేషన్ వాలెంటైన్ క్లాసిక్ వార్ డ్రామా. వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కించారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామా లో జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది సీఆర్పీఎఫ్ జవానులు మృతి చెందారు. ఈ ఘటన ప్రధానాంశంగా ఆపరేషన్ వాలెంటైన్ తెరకెక్కిస్తున్నారు.
టెర్రర్ అటాక్ కి ప్రతిగా కొద్దిరోజుల్లోనే భారత వైమానిక దళం బాలాకోట్ ఎయిర్ స్ట్రైక్స్ కి పాల్పడ్డారు. టెర్రరిస్ట్స్ క్యాంప్స్ పై దాడి చేశారు. ఈ ఘటనల ఆధారంగా ఆపరేషన్ వాలెంటైన్ రూపొందించారు. ఆపరేషన్ వాలెంటైన్ అని టైటిల్ పెట్టడానికి కారణం… పుల్వామా దాడి ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే రోజు జరిగింది. ఈ చిత్రానికి శక్తి ప్రతాప్ సింగ్ హడ దర్శకుడు. సోనీ పిక్చర్స్ ఇంటర్నేషనల్, సందీప్ ముద్దా నిర్మిస్తున్నారు. మార్చి 1న వరల్డ్ వైడ్ విడుదల కానుంది.