Kasturi : కొంతమంది సెలబ్రిటీలు వివాదాలకు కేరాఫ్‌గా ఉంటారు. వారిలో ప్రముఖ నటి కస్తూరి ఒకరు. నాగార్జున నటించిన అన్నమయ్య సినిమాతో తెలుగులో మంచి పాపులారిటీ సంపాదించుకున్న కస్తూరి.. ఆ తర్వాత అడపాదడపా సినిమాలు చేసింది. అయితే ఇప్పుడు సీరియల్స్‌లో నటిస్తోంది. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న కస్తూరి తాజాగా మరో విషయంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అంత:పుర మహిళలకు సేవ చేయడానికే తెలుగు వారు తమిళనాడుకు వచ్చారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు తమను తమిళ జాతి అంటున్నారంటూ కస్తూరి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. ఆనాడు రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేయడానికి వచ్చిన వారు తెలుగువాళ్లని, అలా వచ్చిన వాళ్లంతా ఇప్పుడు తమిళ జాతి అని మాట్లాడుతున్నారని సినీ నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపుతున్నాయి. 300 ఏళ్ల క్రితం ఓ రాజు అంతఃపుర స్త్రీలకు సేవ చేసేందుకు వచ్చిన తెలుగు వారు.. ఇప్పుడు తమిళ జాతి అంటున్నారు… మరి ఇక్కడికి వచ్చిన బ్రాహ్మణులు తమిళులు కాదని చెప్పడానికి మీరెవరు..?’’ అని పరోక్షంగా ద్రావిడ సిద్ధాంత వాదులను ప్రశ్నించారు.
తమిళనాడు రాష్ట్ర రాజకీయాల్లో మతం, లేకపోతే కులం అన్నట్లుగా రాజకీయాలు మారిపోయాయి. నిన్నటి వరకు ప్రస్తుత డిప్యూటీ సీఎం ఉదయ నిధి స్టాలిన్ చేసిన ”సనాతన ధర్మం” పై వివాదాస్పద వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కాకరేపాయి. ఆయనపై విమర్శలు కూడా వెల్లువెత్తాయి. ఈ మంటలు ఇంకా చల్లారక ముందే.. ఇప్పుడు నటి కస్తూరి మరో వివాదానికి ఆజ్యం పోశారు. తెలుగు మాట్లాడే తమిళియన్లను, తెలుగు వారిని కూడా టార్గెట్ చేశారు. ఆమె కొన్నాళ్ల కిందట బీజేపీలో చేరారు. ప్రస్తుతం ఆమె ఓ జిల్లాకు చీఫ్‌గా కూడా వ్యవహరిస్తున్నారు. 2026లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా చేసుకుని రాష్ట్రంలో బీజేపీ రాజకీయంగా పావులు కదుపుతోంది. అధికార డీఎంకేలో చీలికలు తీసుకురావడంతో పాటు.. కొన్ని వర్గాలను కూడా తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. బహుశ దీనిలో భాగంగానే ఏమో.. తెలియదు కానీ, కస్తూరి తాజాగా తెలుగు మాట్లాడే వారిని టార్గెట్ చేసుకుని కామెంట్లు చేశారు.
చెన్నైలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆమె పాల్గొని… “ ఆనాడు రాజుల కాలంలో అంతఃపుర కాంతలకు సేవ చేయడానికి వచ్చిన వారే తెలుగువారు“ అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇలా వచ్చిన వారు వచ్చినట్లు ఉండక.. తాము తమిళులమని, తమది కూడా తమిళ జాతి అని చెప్పుకొంటున్నారని కస్తూరి విమర్శించారు. ఇదే సమయంలో ద్రవిడులకు తామే పెద్ద దిక్కు అని చెప్పుకొనే డీఎంకే పార్టీని కస్తూరి టార్గెట్ చేశారు. తెలుగు నేల నుంచి వచ్చిన వారు తాము తమిళులమని చెప్పుకొంటుంటే.. అంతకు ముందే తమిళనాడుకు వచ్చి స్థిరపడిన బ్రాహ్మణులను.. తమిళులు కాదని చెప్పడానికి మీరెవరని ఆమె ద్రవిడ వాదులను ఆమె నిలదీశారు. అంతేకాదు.. తెలుగు మాట్లాడే వారికి .. డీఎంకే ప్రభుత్వం ప్రాధాన్య మిస్తోందని, తమిళులను అణచేస్తుందని కూడా కస్తూరి వ్యాఖ్యానించారు. `ప్రస్తుత తమిళనాడు రాష్ట్ర కేబినెట్ లో ఐదుగురు తెలుగు మాట్లాడే మంత్రులున్నారు. తమకు ప్రభుత్వంలో భాగం, అధికారంలో భాగం కావాలంటూ డీపీఐ ప్రధాన కార్యదర్శి తిరుమాళవన్ కొత్త నినాదం తెస్తున్నారు` అని ఆమె కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా వివాదం రగిలించాయి. తద్వారా డీఎంకేకు.. వాస్తవ తమిళ బ్రాహ్మణులను దూరం చేయడం ద్వారా బీజేపీకి వారిని చేరువ కావాలన్న లక్ష్యం అయితే కనిపిస్తోందన్న సుష్పష్టం
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Movie actress kasturis comments are causing a sensation
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com