రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యం, మారుతున్న ఆహారపు అలవాట్ల వల్ల మనుషుల ఆయుష్షు అంతకంతకూ తగ్గుతోంది. ప్రస్తుతం మనిషి జీవితకాలం 70 సంవత్సరాలకు అటూఇటుగా ఉంది. అయితే ఒక వృద్ధుడు మాత్రం ఏకంగా 256 సంవత్సరాలు జీవించాడు. చైనా దేశానికి చెందిన లీ చింగ్ యుయెన్ 256 సంవత్సరాలు జీవించి అరుదైన ఘనతను సొంతం చేసుకున్నారు. లీ చింగ్ యుయెన్ అనుసరించిన జీవన విధానమే ఇలా బ్రతకడానికి కారణమని తెలుస్తోంది.
Also Read: కారు కొనేవాళ్లకు శుభవార్త.. ఏకంగా లక్షన్నర రూపాయల తగ్గింపు..?
10 సంవత్సరాల వయస్సులో లీ చింగ్ యుయెన్ ఆయుర్వేద మూలికలు సేకరిస్తూ బ్రతికేవారు. ఆ తరువాత లీ చింగ్ వైద్యునిగా మారి వైద్య సేవలను అందిస్తూ ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తిరిగే వాడు. ఆ విధంగా అతను 72వ సంవత్సరంలో కైక్సియన్ అనే ప్రాంతానికి చేరుకున్నాడు. 1749 సంవత్సరంలో చైనా ఆర్మీలో చేరి మార్షల్ ఆర్ట్స్ ను నేర్పిస్తూ విధులు నిర్వహించేవాడు.
Also Read: రైతులకు మోదీ సర్కార్ శుభవార్త.. మళ్లీ ఖాతాల్లో రూ.2000..?
లీకి అప్పటికే 24 మంది యువతులతో పెళ్లిళ్లు కాగా 24 మంది భార్యలతో అతను ఏకంగా 500 మంది సంతానాన్ని కనడం గమనార్హం. 256 సంవత్సరాలలో లీ చింగ్ ఏకంగా 11 తరాలను చూశారు. ఒక వార్తా పత్రిక కథనం ప్రకారం లీ చింగ్ ఏకంగా 256 సంవత్సరాలు బ్రతికినట్టు తెలుస్తోంది. లీ చింగ్ మరణించే సమయంలో అతని 24వ భార్య వయస్సు 250 సంవత్సరాలు. లీ చింగ్ కొన్ని నియమాలను పాటించడం ద్వారానే ఇంతకాలం బ్రతికాడని తెలుస్తోంది.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
తాబేలులా కూర్చోవడం, పావురంలా నడవడం, కుక్కలా నిద్రించడం, మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవడం అతను ఎక్కువ సంవత్సరాలు జీవించడానికి కారణమని తెలుస్తోంది. లీ చింగ్ మంచి శృంగార జీవితం కూడా అతను ఎక్కువ సంవత్సరాలు జీవించడానికి కారణమని తెలుస్తోంది.