Obama – India : వివక్షకు గురైన నల్లవాడికన్నా అమెరికా జాత్యహంకారిగా ఒబామా

జోబిడెన్-మోడీ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించే రోజున భారత్ కు, మోడీకి వ్యతిరేకంగా ఒబామా వ్యాఖ్యానించడం ఏ విధంగా హర్షణీయం కాదు.. మామూలు వ్యక్తులు వ్యాఖ్యానించడం వేరు.. మాజీ అధ్యక్షుడిగా.. గౌరవం ఉన్న వ్యక్తిగా ఒబామా ఇలా మాట్లాడడం అందరినీ షాక్ కు గురిచేసింది.

Written By: NARESH, Updated On : June 27, 2023 7:27 pm
Follow us on

Obama – India : అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా వ్యాఖ్యలు భారత్ లో పెద్ద దుమారాన్ని రేపాయి. ఒబామా మామూలు వ్యక్తి కాదు.. ఇప్పటికే మోడీకి వ్యతిరేకంగా అమెరికన్ మీడియా,, ఇక్కడి వ్యక్తులు విపరీతంగాప్రచారం చేశాయి. కానీ ఇందులో ఒబామా కూడా చేరడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఒబామా మాజీ అధ్యక్షుడు.. అమెరికా చరిత్రలో పవర్ ఫుల్ వ్యక్తిగా పేరుగాంచాడు. భారతీయులు అత్యంత గౌరవించే అభిమానించే వ్యక్తుల్లో ఒబామా ఒకరు. ఒక్కసారిగా మోడీ, భారత్ పై వ్యాఖ్యలతో తన ప్రతిష్టను ఒబామా దిగజార్చుకున్నాడు.

అమెరికా మాజీ అధ్యక్షుడిగా ఉండి.. జోబైడెన్ ఒకప్పుడు ఒబామా కింద వైస్ ప్రెసిడెంట్ గా చేశాడు. ఒబామా పార్టీనే ఇప్పుడు మోడీని ఆహ్వానించింది. అలాంటి అరుదైన గౌరవాన్ని అందుకుంటూ జోబిడెన్-మోడీ జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించే రోజున భారత్ కు, మోడీకి వ్యతిరేకంగా ఒబామా వ్యాఖ్యానించడం ఏ విధంగా హర్షణీయం కాదు.. మామూలు వ్యక్తులు వ్యాఖ్యానించడం వేరు.. మాజీ అధ్యక్షుడిగా.. గౌరవం ఉన్న వ్యక్తిగా ఒబామా ఇలా మాట్లాడడం అందరినీ షాక్ కు గురిచేసింది.

వివక్షకు గురైన నల్లవాడికన్నా అమెరికా జాత్యహంకారిగా ఒబామా వ్యవహరించారు. ఒబామా వ్యాఖ్యలపై ‘రామ్’గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.