
NTR Marriege : ప్రేమ అనంతం. అత్యంత శక్తివంతమైన ఆయుధం. ప్రేమతో గెలవలేనిది లేదు. ఆ ప్రేమ ఎవరినైనా లొంగదీసుకుంటుంది. ప్రేమకు కుల మత, పేద ధనిక, చిన్నా పెద్దా అనే తారతమ్యాలు ఉండవు. దాని మాయలో పడితే ఎవరి బుద్ధి అయినా మందగిస్తుంది. అశేష అభిమానులతో వెండితెర రారాజుగా కీర్తించబడిన ఎన్టీఆర్ కూడా మినహాయింపు కాదు. ఆయన్ని రెండు పర్యాయాలు ఈ ప్రేమ మైకం ఆవహించింది. సంచలన నిర్ణయాలకు పురిగొల్పింది. భర్తగా ఒకసారి, వృద్ధుడిగా మరోసారి ప్రేమపాశం ఆయనలో రెండో పెళ్లి వాంఛ కలిగించింది.
నటుడిగా రాజకీయ నాయకుడిగా ఘన చరిత్ర కలిగిన ఎన్టీఆర్ కూడా ప్రేమకు అతీతుడు కాదని నిరూపించుకున్నాడు. ఎన్టీఆర్ 1942లో మరదలు బసవతారకంను వివాహం చేసుకున్నారు. బసవతారం 1986లో కన్నుమూయగా.. 1993లో లక్ష్మీ పార్వతిని రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే బసవతారకం బ్రతికుండగానే ఆయన ఒక హీరోయిన్ మీద మనసుపడ్డారు. ఆమెను పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు. లేదా సహజీవనం చేయాలని ఆశపడ్డారు.
ఎన్టీఆర్ మనసు దోచిన ఆ హీరోయిన్ ఎవరో కాదు కృష్ణకుమారి. ఈ హీరోయిన్ పై ఎన్టీఆర్ కి ప్రేమ కలగడానికి కొన్ని పరిస్థితులు దారితీశాయి. కృష్ణకుమారితో ఎన్ టీఆర్ వరుస చిత్రాలు చేయాల్సి వచ్చింది. కృష్ణకుమారి సహజ సుందరి. అందానికి మించిన అణకువ, మాట తీరు, ప్రవర్తన కలిగిన అమ్మాయి. కృష్ణకుమారిలోని గొప్ప లక్షణాలు ఎన్టీఆర్ ని విపరీతంగా ఆకర్షించాయి. అభిమానం కాస్త ప్రేమగా మారింది. కృష్ణకుమారిలో కూడా ఎన్టీఆర్ పట్ల తెలియకుండా ప్రేమ భావన మొదలైంది.
ఈ క్రమంలో ఎన్టీఆర్-కృష్ణకుమారిల మధ్య సాన్నిహిత్యం పెరిగింది. పబ్లిక్ కి తెలియక పోయినా పరిశ్రమ వర్గాల్లో ఇది హాట్ టాపిక్ అయ్యింది. ఎన్టీఆర్ తో పెళ్లికైనా సహజీవనానికైనా కృష్ణకుమారి సిద్దమయ్యారు. కృష్ణకుమారికి పూర్తిగా మనసిచ్చిన ఎన్టీఆర్ సమాజం, కట్టుబాట్లు పట్టించుకోలేదు. ఇతరుల సంగతి నాకు అనవసరం… భార్య బసవతారకం ఒప్పుకుంటే చాలు అనుకున్నాడు. నేరుగా బసవతారంకి ఈ విషయం చెప్పాడు. ఆమె ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు. మీ ఇష్టమే నా ఇష్టం అన్నారు.
గర్భవతి అయిన బసవతారం అప్పటికే 11 మంది పిల్లలకు జన్మనిచ్చారు. చివరిగా తన నిర్ణయాన్ని తమ్ముడు త్రివిక్రమరావుకు చెప్పారు. విజయవాడలో ఉన్న త్రివిక్రమరావు కారులో హుటాహుటిన చెన్నై వెళ్లారు. నేరుగా కృష్ణకుమారి ఇంటికి వెళ్లి ఆమెను బెదిరించారట. ఎన్టీఆర్ అంటే దేవుడిగా ఆంధ్రులు పూజిస్తున్నారు. అలాంటిది ఆయన రెండో వివాహం చేసుకున్నాడని తెలిస్తే ఇమేజ్ అంతా పోతుంది. నీకు గంట టైం ఇస్తా… ఎక్కడికైనా వెళ్ళిపో లేదంటే చంపేస్తా, అని గట్టిగా హెచ్చరించారు. భయంతో కృష్ణకుమారి బెంగుళూరు వెళ్లిపోయారు. ఎన్టీఆర్ నివాసానికి వెళ్లి ఆయనకు కూడా అర్థమయ్యేలా నచ్చజెప్పాడట. దీంతో మనసు చంపుకుని ఎన్టీఆర్ సమాజం కోసం తన ప్రేయసి కృష్ణకుమారిని వదులుకున్నాడు.