
‘Amigos’ collections : నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన ‘అమిగోస్’ చిత్రం ఈమధ్యనే విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకొని కూడా కనీసస్థాయి వసూళ్లను కూడా రాబట్టలేక బాక్స్ ఆఫీస్ వద్ద చతికిలపడింది. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ ప్రకారం.. హైప్ లేకపోతే బాగున్నా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొట్టాల్సిందే అని మరోసారి నిరూపించింది ఈ సినిమా.
‘బింబిసారా’ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచి సుమారు 40 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు సాధించేలోపు ‘అమిగోస్’ చిత్రానికి 15 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే.. బ్రేక్ ఈవెన్ కి దగ్గర్లోకి కూడా ఈ సినిమా వచ్చే సూచనలు కనిపించడం లేదు. మొదటి రోజు రెండు కోట్ల రూపాయలకు పైగా షేర్ ని రాబట్టిన ఈ సినిమా రెండవ రోజు కేవలం కోటి 11 లక్షల రూపాయిలను మాత్రమే వసూలు చేసింది.
కనీసం ఆదివారం రోజైన ఈ సినిమా డీసెంట్ స్థాయి వసూళ్లను రాబడుతుందని ట్రేడ్ అంచనా వేస్తే ఆరోజు కూడా నిరాశే పరిచింది ఈ చిత్రం. కొన్ని చోట్ల శనివారం రోజు వచ్చిన వసూళ్ల రేంజ్ లో కూడా లేవు, ఈ చిత్రానికంటే 30 రోజుల క్రితం విడుదలైన మెగాస్టార్ చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి నేడు హౌస్ ఫుల్ కలెక్షన్స్ రావడం విశేషం. ట్రేడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా మూడవ రోజు కేవలం 70 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను మాత్రమే రాబట్టే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.
అలా మూడు రోజులకు కలిపి ప్రపంచవ్యాప్తంగా 5 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది అంచనా వేస్తున్నారు విశ్లేషకులు..అయితే ట్రేడ్ వర్గాల్లో ఇంకా ఆశపోలేదు.ఎందుకంటే ఫిబ్రవరి 18 వ తేదీన శివ రాత్రి ఉంది, ఆ రోజు ఈ సినిమా కొంతమేరకు కలెక్ట్ చేస్తుందని అంచనా వేస్తున్నారు..చూడాలిమరి వాళ్ళ అంచనాలను ఈ సినిమా అందుకుంటుందా లేదా అనేది.