Devara NTR30: #RRR చిత్రం విడుదలై ప్రభంజనం సృష్టించి సంవత్సరం రోజులైనా ఎన్టీఆర్ ఇంకా కొత్త సినిమా ప్రారంభించలేదని #NTR30 అప్డేట్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియా లో చేసిన ట్రెండ్ ని అంత తేలికగా మర్చిపోలేము. ఇప్పుడు ఆ చిత్రం ప్రారంభం అయ్యి మొదటి షెడ్యూల్ ని కూడా పూర్తి చేసుకొని రెండవ షెడ్యూల్ కోసం సిద్ధం అవుతుంది.
ఇక రేపు ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా కాసేపటి క్రితమే ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ మరియు టైటిల్ ని విడుదల చేసారు. ఈ సినిమాకి ‘దేవర’ అనే టైటిల్ ని ఫిక్స్ చేసినట్టు సమాచారం.నల్ల చొక్కా నల్ల లుంగీ లో ఊర మాస్ లుక్ తో కనిపిస్తున్న ఎన్టీఆర్ ని చూసి ఫ్యాన్స్ పూనకాలు వచ్చి ఊగిపోతున్నారు. ఎన్టీఆర్ ని ఇంత మాస్ గా వాళ్ళు చూసి చాలా కాలమే అయ్యింది.
ఇందులో ఎన్టీఆర్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడు. అందులో ఒక పాత్ర వర్తమానంలో ఉండగా, మరో పాత్ర ఫ్లాష్ బ్యాక్ లో వర్తమానం లో ఎన్టీఆర్ కి తండ్రి పాత్ర.పెద్ద ఎన్టీఆర్ ఇందులో స్మగ్లర్ రోల్ ని చేస్తున్నాడు. ఒక రోజు సముద్రం లో ప్రయానికొస్తుండగా సైఫ్ అలీ ఖాన్ మరియు అతని అనుచరులు పెద్ద ఎన్టీఆర్ ని మరియు ఆయన మనుషుల్ని చంపేస్తారు.
అప్పుడు తన తండ్రి మీద రివెంజ్ తీర్చుకోవడం కోసం, చిన్న ఎన్టీఆర్ సైఫ్ అలీ ఖాన్ ఉంటున్న చోటకి అడుగుపెడతాడు.ఇందులో శ్రీకాంత్ కి కూతురుగా జాన్వీ కపూర్ నటిస్తుంది. స్టోరీ చాలా రొటీన్ గా ఉన్నప్పటికీ కొరటాల శివ ఈ చిత్రాన్ని గ్రాండ్ స్కేల్ లో పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కిస్తున్నాడు. టేకింగ్ కూడా ఇంతకు ముందు ఎన్నడూ లేని విధంగా ఉండబోతోందట. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ‘దేవర’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కాబోతుంది.
#Devara pic.twitter.com/bUrmfh46sR
— Jr NTR (@tarak9999) May 19, 2023