Maruti Grand Vitara: మైలేజీలోనే కాదు.. అమ్మకాల్లోనూ టాప్‌ గేర్‌.. అదరగొడుతున్న మారుతీ గ్రాండ్‌ విటారా..

2022, నవంబర్‌తో పోలిస్తే 2023, నవంబర్‌లో మారుతి కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. విటారా అమ్మకాలు 79% ఎక్కువ యూనిట్లు అమ్ముడయ్యాయి. 2022 నవంబర్‌లో మొత్తం 4,433 యూనిట్ల మారుతి గ్రాండ్‌ విటారా విక్రయించగా, 2023 నవంబర్‌లో 7,937 యూనిట్లు విక్రయించబడ్డాయి.

Written By: Raj Shekar, Updated On : December 20, 2023 11:19 am

Maruti Grand Vitara

Follow us on

Maruti Grand Vitara: కార్‌ లవర్స్‌ను ఆకట్టుకుంటూ.. అమ్మకాల్లో టాప్‌గేర్‌తో అదరగొడుతోంది.. మారుతి సుజుకి గ్రాండ్‌ విటారా. గతేడాది సెప్టెంబర్‌లో లాంచ్‌ అయిన ఈ కారుకు కస్టమర్ల నుంచి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. దీనిని మారుతి విజయవంతమైన ఎస్‌యూవీగా చూడొచ్చు. 2023 నవంబర్‌లో అత్యధికంగా అమ్ముడైన టాప్‌–20 కార్లలో ఇది 18వ స్థానంలో ఉంది.

79% పెరిగిన అమ్మకాలు..
2022, నవంబర్‌తో పోలిస్తే 2023, నవంబర్‌లో మారుతి కార్ల అమ్మకాలు భారీగా పెరిగాయి. విటారా అమ్మకాలు 79% ఎక్కువ యూనిట్లు అమ్ముడయ్యాయి. 2022 నవంబర్‌లో మొత్తం 4,433 యూనిట్ల మారుతి గ్రాండ్‌ విటారా విక్రయించగా, 2023 నవంబర్‌లో 7,937 యూనిట్లు విక్రయించబడ్డాయి. ఈ విక్రయాల సంఖ్యతో ఇది 11వ అత్యధికంగా అమ్ముడవుతున్న ఎస్‌యూవీగా మారుతి సుజుకి గ్రాండ్‌ విటారా అనేది టయోటా అర్బన్‌ క్రూయిజర్‌ హైరైడర్‌ రీబ్యాడ్జ్‌ వెర్షన్‌ కావడం గమనార్హం.

ధరలు ఇలా..
మారుతి గ్రాండ్‌ విటారా కంపెనీ ఫ్లాగ్‌షిప్‌ ఎస్‌యూవీ ధర రూ. 10.70 నుంచి 19.99 లక్షలు (ఎక్స్‌–షోరూమ్‌). ఇది సిగ్మా, డెల్టా, జీటా, జీటా+, ఆల్ఫా, ఆల్ఫా+ ట్రిమ్‌లలో వస్తుంది. జీటా ప్లస్, ఆల్ఫా ప్లస్‌ బలమైన హైబ్రిడ్‌ పవర్‌ట్రెయిన్‌ ఎంపికను కలిగి ఉన్నాయి. అయితే, డెల్టా, జీటా వేరియంట్లలో సీఎన్‌జీ కిట్‌ ఎంపిక ఉంది.

మంచి మైలేజీ..
ఈ 5–సీటర్‌ ఎస్‌యూవీ ప్రజాదరణకు దాని మైలేజీ ఒక కారణం. బలమైన హైబ్రిడ్‌ పవర్‌ట్రెయిన్‌తో ఇది 27.97 కేఎంపీఎల్‌ మైలేజీని ఇస్తుంది. అదే సమయంలో, దీని సీఎన్‌జీ వేరియంట్‌ కిలోగ్రాముకు 26.6 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇవ్వగలదు. ఇది 1.5 లీటర్‌ పెట్రోల్‌ మైల్డ్‌–హైబ్రిడ్‌ (103 పీఎస్‌), 1.5–లీటర్‌ పెట్రోల్‌ స్ట్రాంగ్‌–హైబ్రిడ్‌ (116 పీఎస్‌), 1.5–లీటర్‌ పెట్రోల్‌– సీఎన్‌జీ (87.83 పీఎస్‌) ఎంపికలను కలిగి ఉంది.

అదిరిపోయే ఫీచర్స్‌..
మారుతి గ్రాండ్‌ విటారా మైల్డ్‌–హైబ్రిడ్‌ ఇంజన్‌తో 5–స్పీడ్‌ మాన్యువల్, 6–స్పీడ్‌ ఆటోమేటిక్‌ గేర్‌బాక్స్‌ ఎంపిక ఉంది. కేవలం ఈ–సీవీటీ గేర్‌బాక్స్‌ దాని బలమైన హైబ్రిడ్‌ ఇంజన్‌తో అందుబాటులో ఉంది. అయితే, 5–స్పీడ్‌ మ్యాన్యువల్‌ గేర్‌బాక్స్‌ సీఎన్‌జీలో అందుబాటులో ఉంది. ఇది ఆల్‌–వీల్‌ డ్రైవ్‌ ఎంపికను కూడా కలిగి ఉంది. ఇది టాప్‌ మైల్డ్‌–హైబ్రిడ్‌ వేరియంట్‌లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.