Devara Collection: ‘దేవర’ 5 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..హిందీ లో సెన్సేషన్..తెలుగు వెర్షన్ ని కూడా దాటేసింది!

ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ సినిమాకి నిన్న కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 4 కోట్ల 80 లక్షల రూపాయిలు వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో ఇప్పటి వరకు 5 రోజులకు కలిపి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు సాధించినట్టుగా చెప్తున్నారు ట్రేడ్ పండితులు.

Written By: Vicky, Updated On : October 2, 2024 3:16 pm

Devara Collection(3)

Follow us on

Devara Collection: ఎన్టీఆర్ నటించిన రీసెంట్ చిత్రం ‘దేవర’ కేవలం ఓపెనింగ్స్ లో మాత్రమే కాదు, లాంగ్ రన్ లో కూడా మంచి వసూళ్లను రాబడుతూ ముందుకు దూసుకుపోతుంది. సోమవారం నాడు కాస్త వసూళ్లు డ్రాప్ అవ్వడంతో ట్రేడ్ కాస్త భయపడింది. కానీ మంగళవారం సాయంత్రం నుండి అనేక నగరాల్లో ఈ చిత్రం వసూళ్లు పుంజుకోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇక నేడు నేషనల్ హాలిడే అవ్వడం తో రాయలసీమ ప్రాంతంలో నిన్న నాలుగు షోస్ కి కలిపి వచ్చిన వసూళ్లు, నేడు కేవలం మార్నింగ్ షోస్ లో వచ్చింది. 2 వ రోజు తర్వాత ‘దేవర’ చిత్రానికి నేడు బాక్స్ ఆఫీస్ పరంగా మంచి రోజు అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇదంతా పక్కన పెడితే 5 రోజులకు కలిపి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంత వసూళ్లను రాబట్టిందో ఇప్పుడు మనం వివరంగా చూడబోతున్నాము.

ట్రేడ్ పండితుల అంచనా ప్రకారం ఈ సినిమాకి నిన్న కేవలం తెలుగు రాష్ట్రాల నుండే 4 కోట్ల 80 లక్షల రూపాయిలు వచ్చినట్టు తెలుస్తుంది. దీంతో ఇప్పటి వరకు 5 రోజులకు కలిపి ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 140 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లు సాధించినట్టుగా చెప్తున్నారు ట్రేడ్ పండితులు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి హిందీ లో వస్తున్నా వసూళ్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. మంచి వీకెండ్ తర్వాత సోమవారం కూడా ఈ సినిమాకి మంచి వసూళ్లు వచ్చాయి. తెలుగు వెర్షన్ వసూళ్లు బాగా డౌన్ అయినప్పటికీ, హిందీ వెర్షన్ వసూళ్లు అవ్వలేదు. సోమవారం నాడు కేవలం హిందీ వెర్షన్ లో 3 కోట్ల 50 లక్షల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, 5వ రోజు 4 కోట్ల 30 లక్షల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టింది. మొత్తం మీద ఈ చిత్రం 5 రోజులకు కలిపి 40 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను హిందీ వెర్షన్ లో రాబట్టింది.

ఇదే ట్రెండ్ ని కొనసాగిస్తూ ముందుకు పోతే ఫుల్ రన్ లో ఈ చిత్రం హిందీ వెర్షన్ 100 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లకు చేరుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదని అంటున్నారు. ప్రభాస్, రాజమౌళి కాకుండా బాలీవుడ్ లో 100 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లను రాబట్టిన హీరో అల్లు అర్జున్ మాత్రమే. ఇప్పుడు ఆ జాబితా లోకి జూనియర్ ఎన్టీఆర్ కూడా చేరిపోయాడు. కేవలం ఇండియా లోనే కాదు నార్త్ అమెరికా లో కూడా ఈ సినిమా పని దినాల్లో డీసెంట్ స్థాయి వసూళ్లను రాబట్టింది. సోమవారం రోజు లక్షా 95 వేల గ్రాస్ వసూళ్లను రాబట్టగా, మంగళవారం రోజు 2 లక్షల డాలర్లకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది అంటున్నారు. అలాగే ఆస్ట్రేలియా లో కూడా ఈ చిత్రం 5 రోజుల్లో 9 లక్షల డాలర్స్ ని రాబట్టింది. ఈరోజు లేదా రేపటి లోపు ఈ చిత్రం 1 మిలియన్ మార్కుని అందుకోబోతుంది.