ఏపీ ప్రభుత్వంతో ఢీ అంటే ఢీ అంటున్న ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డకు ఇప్పుడు చీమ కుట్టినా కూడా దానికి సీఎం జగన్ యే కారణమని ఆరోపించడానికి ప్రతిపక్ష టీడీపీ కాచుకు కూర్చుంది. పంచాయతీ ఎన్నికల సందర్భంగా ఏకంగా ఏపీప్రభుత్వంతోనే పోరాడారు నిమ్మగడ్డ. ఇప్పటికీ ముప్పు తిప్పలు పెడుతున్నాడు.
నిమ్మగడ్డ ప్రయత్నాలకు విరుగుడుగా ఏపీ ప్రభుత్వం ఒక పక్క ఏకగ్రీవాలకు ప్రోత్సాహకాలు ఇస్తూ ఏకగ్రీవాలు కావాలని చూస్తుంటే ఏకంగా నిమ్మగడ్డ ప్రస్తుతం జిల్లాల్లో పర్యటిస్తూ అలా కాకుండా అడ్డుకుంటున్నారు. అధికారులను బదిలీ చేస్తున్నారు.
ఈరోజు కడప జిల్లా పర్యటనకు నిమ్మగడ్డ రెడీ అయ్యారు. అక్కడికి వెళ్లబోతుండగా సడెన్ గా అస్వస్థతకు గురయ్యారు. నిమ్మగడ్డ కంటికి తీవ్ర ఇన్ఫెక్షన్ కు గురైనట్టు తెలిసింది. దీంతో హుటాహుటిన ఈ రోజు ఉదయం 11 గంటలకు నిమ్మగడ్డ ఎల్వీ ప్రసాద్ కంటి ఆస్పత్రికి కంటి పరీక్షల కోసం వెళ్లారు..ఆయన కంటికి ఇన్ఫెక్షన్ ప్రమాదమా? లేక సహజంగా జరిగిందా? దానికి సంబంధించి వైద్యులు పరీక్షలు చేస్తున్నట్టు తెలిసింది. దీంతో ఈరోజు కడప జిల్లా పర్యటను ఆయన వాయిదా వేసుకున్నారు.
ఏపీలో రేపే మొదటి దశ ఎన్నికల పోలింగ్. ఇలాంటి క్రూషియల్ టైంలో నిమ్మగడ్డ అస్వస్థతకు గురికావడం చర్చనీయాంశమైంది. ఇది ప్రమాదమా? లేక సహజంగా జరిగిందా? అనేది వైద్యులు నిగ్గుతేలాల్సి ఉంది.