Nitish Kumar : బీహార్ సీఎం నితీష్ కుమార్ ఇండియా కూటమికి కొట్టిన దెబ్బ కోలుకోలేనది.. ఇది మామూలు దెబ్బ కాదు. నమ్మించి మోసం చేశాడు. బీహార్ లో ఎన్నికల బలబలాలు మారిపోయాయి. రెండోది ఇండియా కూటమి పూర్తిగా బలహీనపడిపోయింది.
బీహార్ లో 9 సార్లు నితీష్ కుమార్ అటూ ఇటూ మారాడు. అధికారం కోసం ప్రత్యర్థులతోనూ.. మిత్రులతోనూ తెగదెంపులు చేసుకుంటూ పార్టీల పొత్తులు మార్చుకున్నాడు. ఎక్కువ సార్లు పల్టీలు కొట్టిన నేత గా నితీష్ పేరు పొందాడు.
కానీ బీహార్ రాజకీయాలు వేరుగా ఉంటాయి. అక్కడ నితీష్ స్థానం చాలా కీలకం. ఆర్జేడీ, బీజేపీలను నితీష్ సమదూరంగా పెట్టి రెండు పార్టీలను వాడేసుకుంటున్నాడు. బీహార్ సమాజం కులాలతో నిండిపోయింది. నితీష్ కుమార్ కు ఉన్న అడ్వంటేజ్ ఏంటంటే.. వెనుకబడిన కులాల్లో అత్యంత వెనుకబడిన వారిని.. దళితుల్లోనూ అత్యంత వెనుకబడిన వారు ఈ నితీష్ ను హీరోగా చూస్తున్నారు. నితీష్ తమకు బాగా చేస్తున్నాడన్న భావన వారిలో ఉంది.
బీజేపీ కూడా ఇప్పుడు నితీష్ కు సపోర్ట్ చేయడానికి అక్కడ వాస్తవ పరిస్థితులే కారణం.. ఒంటరిగా వెళితే బీజేపీ ఓడిపోవడం ఖాయం. రిస్క్ తీసుకోకుండా బీజేపీ వెంటనే నితీష్ కు మాద్దతు తెలిపింది.
జేడీయూ, కాంగ్రెస్, ఆర్జేడీ కలిస్తే బీహార్ వాళ్లదే. అందుకే వాళ్ల కూటమిని చీల్చి నితీష్ కు సపోర్ట్ చేసింది. బీజేపీ, జేడీయూ, చిన్న పార్టీలతో కలిస్తే ఆర్జేడీ, కాంగ్రెస్ ను ఈజీగా ఎదురించవచ్చు. బీజేపీ ప్లాన్ చేయడానికి కారణం అదే..
నితీష్ పల్టీ ఇండీ కూటమికి కోలుకోలేని దెబ్బ.. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.