Nirmala Sitharaman budget : నిర్మలమ్మ 9వ బడ్జెట్ ఎలా ఉంది? అని చూస్తే.. అంచనాలకు పతాక శీర్షికల్లో పెట్టడం లేదు. గత ప్రభుత్వాలకు భిన్నంగా ఆచరణాత్మకంగా.. ఫ్యూచర్ రెడీ బడ్జెట్ గా చెప్పొచ్చు. ఇందులో 10 కీలక టేక్ అవేలు చూస్తే.. ఈ బడ్జెట్ ప్రధానంగా సిస్టమ్స్ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది.
ఎన్నికలను దృష్టిలో పెట్టుకోకుండా ఏ రంగాల్లో ఎక్కడున్నాం? ఇక్కడున్న ఇబ్బందులు.. మెరుగుపరుచుకోవాల్సిన విషయాలపై బడ్జెట్ దృష్టి సారించింది. తయారీ రంగంలోని ఇబ్బందులను దృష్టిలోపెట్టుకొని వాటి తొలగించడానికి బడ్జెట్ లో ప్రాధాన్యతనిచ్చారు. ప్రాసెస్ రిఫామ్స్ దిశగా ఈ బడ్జెట్ సాగింది.
ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థకు ఊతం ఇచ్చేలా బడ్జెట్ రూపొందించారు. మన స్కేలు ముందుకెళ్లేలా దానికి అడుగులు వేసేలా రూపొందించారు. దానికి కావాలసిన ఫౌండేషన్, స్ట్రక్చర్ లను ఈ బడ్జెట్ క్రియేట్ చేసింది. మూడోది 2026 క్వాలిటీ మీద ఫోకస్ చేసే సంవత్సరంగా మోడీ చెప్పినట్టు ఈ బడ్జెట్ దాన్ని ప్రతిపాదించారు. మన ప్రాడక్ట్స్ క్వాలిటీగా.. ధరలో కాంపిటీషన్ ఉండేలా ప్రపంచంతో పోటీపడేలా ఈ బడ్జెట్ లో ప్రాధాన్యతనిచ్చారు.
నిర్మలమ్మ బడ్జెట్ లో టాప్ 10 ఫోకస్ అంశాలివీ? దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.
