Homeఆంధ్రప్రదేశ్‌Ambati Rambabu Remand: అంబటి రాంబాబుకు రిమాండ్.. గట్టి కారణాలే చెప్పిన పోలీసులు!

Ambati Rambabu Remand: అంబటి రాంబాబుకు రిమాండ్.. గట్టి కారణాలే చెప్పిన పోలీసులు!

Ambati Rambabu Remand: ఏపీలో( Andhra Pradesh) పొలిటికల్ హీట్ నెలకొంది. మాజీమంత్రి అంబటి రాంబాబు అరెస్ట్ సంచలనంగా మారింది. సీఎం చంద్రబాబుపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీటీడీ లడ్డు వివాదానికి సంబంధించి భారీగా ఫ్లెక్సీలు వెలిసాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న ఈ ఫ్లెక్సీలను తొలగించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమాలు జరిపాయి. ఈ తరుణంలో గుంటూరులో మాజీ మంత్రి అంబటి నేతృత్వంలో ర్యాలీ నిర్వహిస్తుండగా టిడిపి శ్రేణులు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో అంబటి రాంబాబు సీఎం చంద్రబాబుపై బూతు వ్యాఖ్యలు చేశారు. దీంతో టీడీపీ శ్రేణులు మరింత రెచ్చిపోయాయి. ఈ క్రమంలో అంబటి రాంబాబు ఇంటిపై కూడా దాడి జరిగింది. పోలీసులు కలుగజేసుకొని ఆయనను అదుపులోకి తీసుకున్నారు. సీఎం చంద్రబాబు పై వ్యాఖ్యలను తప్పుపడుతూ కేసు నమోదు చేశారు. మరోవైపు అంబటి రాంబాబు పోలీసుల విధులకు భంగం కలిగించారంటూ మరో కేసు కూడా నమోదయింది. అంబటి రాంబాబును కోర్టులో హాజరుపరచగా 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.

కొద్దిరోజులుగా సంచలన వ్యాఖ్యలు..
గత కొద్దిరోజులుగా తన అరెస్టు విషయంలో అంబటి రాంబాబు( ambati Rambabu) సంచలన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు. లోకేష్ రెడ్ బుక్ కోసం ప్రస్తావిస్తూ దానికి తన కుక్క కూడా భయపడదని ఎద్దేవా చేశారు. అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎటువంటి కార్యక్రమాలకు పిలుపునిచ్చినా అంబటి రాంబాబు దూకుడుగానే వ్యవహరిస్తూ వచ్చారు. పోలీసులతో సైతం అనుచితంగా ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా సీఎం చంద్రబాబుపై బూతు వ్యాఖ్యలు చేయడంతో అడ్డంగా బుక్కయ్యారు అంబటి రాంబాబు. అదే విషయాన్ని నల్లపాడు పోలీసులు తమ రిమాండ్ రిపోర్ట్ లో పొందుపరిచారు. రెండు వర్గాల మధ్య వైషమ్యాలు పెంచి.. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని.. అంబటినీ బయట వదిలేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య తలెత్తే ప్రమాదం ఉందని.. రిమాండ్ విధించకపోతే అంబటి ప్రాణానికి హాని కలిగే అవకాశం ఉందని పోలీసులు న్యాయస్థానంలో గుర్తు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు చెలరేగే ఛాన్స్ ఉందని చెప్పడంతో.. న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. అయితే పోలీస్ కస్టడీలో తనపై పోలీసులు అమానుషంగా వ్యవహరించాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు అంబటి. కానీ ఫలితం లేకపోయింది.

షాక్ ట్రీట్మెంట్ తప్పదా
అంబటి రాంబాబు విషయంలో పోలీసులు మరింత కఠినంగా వ్యవహరించే అవకాశం ఉంది. అంబటి తీరుపై తటస్తుల్లో కూడా ఒక రకమైన అభిప్రాయం ఉంది. ఇష్టారాజ్యంగా మాట్లాడతారని అంబటి పై విమర్శలు ఉన్నాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అంబటి అరెస్టు తీరుపై మండిపడుతున్నాయి. మరోవైపు కాపు నేత కావడంతోనే అంబటిని హింసించి అరెస్టు చేశారని వైసిపి ప్రచారం మొదలు పెట్టింది. కానీ అంబటి రాంబాబు విషయంలో సులువుగా వదిలేస్తే అదే పనిగా ప్రచారం చేస్తారని టిడిపి కూటమి నేతలు భావిస్తున్నారు. షాక్ ట్రీట్మెంట్ ఇవ్వాలని కోరుతున్నారు. అయితే తన విధులకు కూడా భంగం కలిగించారని ఓ పోలీస్ అధికారి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో.. పోలీసులు చూపుతున్న కారణాల దృష్ట్యా.. అంబటి రాంబాబు రిమాండ్ సుదీర్ఘకాలం కొనసాగే అవకాశం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version