దేశంలోని యువతలో కొంతమంది డిగ్రీలు పూర్తి చేసిన తరువాత ఉద్యోగం చేయడానికి ఆసక్తి చూపుతుంటే మరి కొంతమంది మాత్రం వ్యాపారం చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. వ్యాపారం సక్సెస్ అయితే సమస్య లేదు కానీ సక్సెస్ కాకపోతే మాత్రం భారీ మొత్తంలో నష్టం వస్తుంది. అయితే తెలివితో వ్యాపారం చేస్తే సులభంగా లక్షల్లో సంపాదించవచ్చని దేశంలోని యువతలో చాలామంది ప్రూవ్ చేస్తున్నారు.
Also Read: అమెజాన్ కస్టమర్లకు శుభవార్త.. స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్లు..?
గుజరాత్ రాష్ట్రానికి చెందిన నీలేష్ తేనెటీగల పెంపకంతో లక్షల రూపాయలు సంపాదించవచ్చని చెబుతున్నారు. ఇటాలియన్ తేనెటీగల పెంపకం ద్వారా సంవత్సరానికి తాను 7 లక్షల రూపాయలు ఆర్జిస్తున్నానని వెల్లడిస్తున్నారు. మొదట 50 తేనెటీగల పెట్టెలతో బిజినెస్ ను మొదలుపెట్టిన నీలేష్ ప్రస్తుతం 200 తేనెటీగల పెట్టెలతో తేనెను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ వ్యాపారం చేస్తున్న నీలేష్ వయస్సు కేవలం 23 సంవత్సరాలు కావడం గమనార్హం.
Also Read: ప్రజలకు షాక్.. భారీగా పెరగనున్న నిత్యావసరాల ధరలు..?
తేనెటీగల పెంపకం గురించి నీలేష్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఆరు నెలల పాటు శిక్షణ పొంది రెండేళ్ల క్రితం తేనెటీగల పెంపకాన్ని ప్రారంభించానని నీలేష్ తెలిపారు. సంవత్సరానికి తాను 1800 కిలోల తేనెను తయారు చేస్తున్నానని వెల్లడించారు. పూలతోటలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో తేనెటీగల పెంపకం చేపడితే మంచి లాభాలను సొంతం చేసుకోవచ్చని అన్నారు.
మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం
తేనెటీగలు పూల నుంచి రసం సేకరించి ఆ రసం మైనంతో ఉన్న పెట్టెల్లో పెడతాయని అందువల్ల తేనె గూళ్లలో తేనె తయారు కావడానికి ఎనిమిది రోజుల సమయం పడుతుందని నీలేష్ అన్నారు. అలా శుద్ధమైన తేనెను తయారు చేయవచ్చని నీలేష్ వెల్లడించారు.