సాధారణంగా హైదరాబాద్ నగరవాసులు సిటీ బస్సుల్లో ఎక్కువగా ప్రయాణం చేస్తే బస్ పాస్ ను తీసుకుంటూ ఉంటారు. బస్ పాస్ ను పొందాలంటే తప్పనిసరిగా ఆర్టీసీ కౌంటర్ కు వెళ్లాల్సి ఉంటుంది. బస్ పాస్ ను రెన్యువల్ చేయించుకోవాలంటే మాత్రం గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సిందే. అయితే గ్రేటర్ ఆర్టీసీ ప్రయాణికులకు బస్ పాస్ కష్టాలకు చెక్ పెట్టేందుకు సిద్ధమైంది.
Also Read: ఏనుగు విగ్రహం ఇంట్లో ఉంచుకోవడం వల్ల ఏం జరుగుతుందో తెలుసా?
ప్రయాణికులు ఫోన్ చేయడం ద్వారా సులభంగా బస్ పాస్ పొందేలా గ్రేటర్ ఆర్టీసీ కొత్త సర్వీసులను అందుబాటులోకి తీరుకురావడానికి సిద్ధమవుతోంది. 8008204216 నంబర్ కు ఫోన్ చేయడం ద్వారా సులభంగా బస్ పాస్ ను పొందే అవకాశం ఉంటుంది. ఈ నంబర్ కు ఫోన్ చేసిన తరువాత బస్ పాస్ సెక్షన్ సిబ్బంది వచ్చి నగదు తీసుకుని బస్ పాస్ లను అందజేస్తారు. ప్రయాణికులకు మరింత చేరువ కావాలనే ఉద్దేశంతొ గ్రేటర్ ఆర్టీసీ ఈ సర్వీసులను అందిస్తోంది.
Also Read: ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేవాళ్లకు అలర్ట్.. పాటించాల్సిన జాగ్రత్తలివే..?
అయితే ఈ బస్ పాస్ సర్వీసులను పొందాలనుకుంటే కనీసం ఐదుగురు బస్ పాస్ అవసరం ఉన్నవారు ఉంటే మాత్రమే బస్ పాస్ ను పొందడం సాధ్యమవుతుంది. కరోనా మహమ్మారి విజృంభణ వల్ల గతంతో పోలిస్తే ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య భారీగా తగ్గింది. ఈ నిర్ణయం ద్వారా బస్ పాస్ లు వినియోగించే వారి సంఖ్య భారీగా పెంచవచ్చని గ్రేటర్ ఆర్టీసీ భావిస్తోంది.
మరిన్ని వార్తలు కోసం: జనరల్
మాల్స్, ఆఫీసులు, అపార్ట్ మెంట్లలో ఉండేవాళ్లు సులభంగా ఫోన్ నంబర్ కు కాల్ చేసి బస్ పాస్ ను పొందవచ్చు. ఇంటి దగ్గర బస్ పాస్ పొందినా ఎటువంటి అదనపు ఛార్జీలను చెల్లించాల్సిన అవసరం లేదు. గ్రేటర్ ఆర్టీసీ అందుబాటులోకి తెచ్చిన కొత్త సర్వీసుల గురించి ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.