https://oktelugu.com/

ఏటీఎంలో డబ్బులు డ్రా చేసేవాళ్లకు అలర్ట్.. పాటించాల్సిన జాగ్రత్తలివే..?

దేశంలో మోసాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ ఉన్నవారిని టార్గెట్ చేసి వాళ్లకు సంబంధించిన ఏటీఎం కార్డుల ద్వారా, ఇతర వివరాల ద్వారా మోసాలు చేసేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రోజురోజుకు పెరుగుతున్న మోసాల నేపథ్యంలో దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లను అప్రమత్తం చేసింది. ఏటీఎంల ద్వారా, పీఓఎస్ మిషన్ల ద్వారా నగదు విత్ డ్రా చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్బీఐ వెల్లడించింది. Also Read: పీఎఫ్ అకౌంట్ […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : January 10, 2021 / 04:47 PM IST
    Follow us on

    దేశంలో మోసాలు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా బ్యాంక్ అకౌంట్ ఉన్నవారిని టార్గెట్ చేసి వాళ్లకు సంబంధించిన ఏటీఎం కార్డుల ద్వారా, ఇతర వివరాల ద్వారా మోసాలు చేసేవాళ్ల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. రోజురోజుకు పెరుగుతున్న మోసాల నేపథ్యంలో దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లను అప్రమత్తం చేసింది. ఏటీఎంల ద్వారా, పీఓఎస్ మిషన్ల ద్వారా నగదు విత్ డ్రా చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఎస్బీఐ వెల్లడించింది.

    Also Read: పీఎఫ్ అకౌంట్ ఉన్నవారికి అలర్ట్.. డబ్బులు రాకపోతే ఏం చేయాలంటే..?

    ఎస్బీఐ ఖాతాదారులు ఏటీఎంల ద్వారా డబ్బులు తీసుకునే సమయంలో భద్రతాపరమైన నియమాలను పాటించాలని పేర్కొంది. సైబర్ క్రైమ్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఎస్బీఐ కస్టమర్లకు కీలక సూచనలు చేసింది. ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్ కు ఫోన్ నంబర్ ను తప్పనిసరిగా జత చేయాలని అలా చేయడం ద్వారా సులభంగా లావాదేవీలకు సంబంధించిన వివరాలను తెలుసుకోవచ్చని వెల్లడించింది.

    Also Read: భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఎంత తగ్గాయంటే..?

    ఏటీఎంలలో, పీఓఎస్ మిషన్లలో లావాదేవీలు జరిపే సమయంలో స్పై కెమెరాలు ఏమైనా ఉన్నాయేమో జాగ్రత్తగా పరిశీలించాలని ఎస్బీఐ పేర్కొంది. లావాదేవీ పూర్తైన వెంటనే ఆ లావాదేవీకి సంబంధించిన రిసిప్ట్ ను చెత్తబుట్టలో పడేయాలని ఎస్బీఐ తెలిపింది. అకౌంట్ నంబర్ ను, మొబైల్ నంబర్ ను ఏటీఎం పిన్ గా పెట్టుకోవద్దని ఎస్బీఐ స్పష్టం చేసింది. ఏటీఎం కార్డుపై పిన్ వివరాలను రాసుకోవద్దని పేర్కొంది.

    మరిన్ని వార్తలు కోసం:జనరల్

    ఎవరైనా ఏటీఎం కార్డ్ నంబర్, పిన్ నంబర్, ఇతర వివరాలను చెప్పాలని కాల్ చేస్తే అలాంటి ఫోన్ కాల్స్ కు ఎట్టి పరిస్థితుల్లోను స్పందించి వివరాలను చెప్పవద్దని ఎస్బీఐ పేర్కొంది. ఇతరులతో ఏటీఎం పిన్ కు సంబంధించిన వివరాలను పంచుకోవద్దని పేర్కొంది. ఏటీఎం పిన్ ను ఎంటర్ చేసే సమయంలో చేతిని అడ్డు పెట్టుకుని పిన్ ఇతరులకు కనపడకుండా ఎంటర్ చేసి లావాదేవీ జరపాలని సూచనలు చేసింది.