Homeఎంటర్టైన్మెంట్SPY Movie Review: నిఖిల్ 'స్పై' మూవీ ఫుల్ రివ్యూ

SPY Movie Review: నిఖిల్ ‘స్పై’ మూవీ ఫుల్ రివ్యూ

SPY Movie Review: నటీనటులు : నిఖిల్ సిద్దార్థ్, ఐశ్వర్య మీనన్, రానా దగ్గుపాటి , జిసు సంగుప్త, ఆర్యన్ రాజేష్ తదితరులు.

సంగీతం : శ్రీ చరణ్
సినిమాటోగ్రఫీ : మార్క్ డేవిడ్.
నిర్మాత : రాజశేఖర్ రెడ్డి
డైరెక్టర్ : గర్రీ BH

విభిన్నమైన కోణాలను తీసుకొని , ప్రేక్షకులకు తన సినిమాలతో సరికొత్త అనుభూతిని కలిగించే హీరోలలో ఒకడు నిఖిల్. ‘హ్యాపీ డేస్’ సినిమాతో ప్రారంభమైన అతని కెరీర్, ఆ తర్వాత వరుసగా కొన్ని ఫ్లాప్ సినిమాలలో హీరో గా నటించాడు కానీ, ‘స్వామి రారా’ చిత్రం నుండి మాత్రం నిఖిల్ తన విశ్వరూపాన్ని చూపించేసాడు. స్టార్ హీరోలు సైతం ఈ రేంజ్ స్క్రిప్ట్ సెలెక్షన్స్ చెయ్యలేరు, అసలు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయి అంటూ ప్రేక్షకులు ఆశ్చర్యపొయ్యేవారు నిఖిల్ ని చూసి. అందుకే తనకంటూ ఒక శాశ్వతమైన మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇక గత ఏడాది ఆయన హీరో గా నటించిన ‘కార్తికేయ 2 ‘ చిత్రం పాన్ ఇండియా రేంజ్ లో సంచలన విజయం సాధించింది. ఆ తర్వాత ’18 పేజెస్’ అనే చిత్రాన్ని చేసాడు, ఇది యావరేజి గా ఆడింది. ఇప్పుడు ‘స్పై’ అనే పాన్ ఇండియా సబ్జెక్టు తో మన ముందుకి వచ్చాడు. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందా లేదా అనేది ఒకసారి చూద్దాము.

కథ :

జయ్ (నిఖిల్ సిద్దార్థ్) ఒక రా ఏజెంట్. ఆయనకీ గ్లోబల్ టెర్రరిస్ట్ ఖాదిర్ ఖాన్ , అతను చేసే మారణహోమం ని అడ్డుకొని అతడిని ఇండియా ప్రభుత్వానికి అప్పచెప్పే టాస్క్ వస్తుంది. మరో పక్క తన అన్నయ్య సుభాష్ కూడా ఇలాంటి మిషన్ లోనే పాల్గొని చనిపోతాడు. అతడిని ఎవరు చంపారు అనే దానిని కూడా ఛేదించాలని చూస్తుంటాడు జయ్. ఇవి రెండు కాకుండా, నేతాజీ సుభాష్ చంద్ర బోస్ కి సంబంధించిన ఒక అతి ముఖ్యమైన ఫైల్ కూడా మిస్ అవుతుంది, దీనిని కూడా కనిపెట్టే బాధ్యతని నెత్తి మీద పెట్టుకుంటాడు జయ్. ఈ మూడు టాస్కులను జయ్ విజయవంతంగా పూర్తి చేశాడా?, ఈ టాస్కులు పూర్తి చేసే క్రమం లో అతను ఎలాంటి పరిస్థితులను ఎదురుకున్నాడు అనేదే స్టోరీ.

విశ్లేషణ :

ఒకే కథలో స్పై మూడు డైమెన్షన్స్ ని చూపించి ఒక అద్భుతమైన స్పై థ్రిల్లర్ చిత్రాన్ని చెయ్యాలనుకున్నాడు డైరెక్టర్. చాలా మంచి కాన్సెప్ట్, కానీ టేకింగ్ మాత్రం రొటీన్ గా, బోర్ కొట్టే విధంగా ఉంటుంది. కొత్త కాన్సెప్ట్ అయ్యినప్పటికీ కూడా మనకి డిఫరెంట్ టేకింగ్ తో సినిమాని తీసినట్టు అసలు అనిపించదు. ఇలాంటి సినిమాలను మామూలుగా భారీ బడ్జెట్ తో , భారీ తారాగణం తో కనీవినీ ఎరుగని రీతిలో తెరకెక్కిస్తారు. కానీ ఇక్కడ మాత్రం అతి తక్కువ బడ్జెట్ తో సినిమాని లాగించేసినట్టుగా అనిపిస్తుంది. ఈ సినిమాలో ఆసక్తికరమైన అంశం ఏదైనా ఉందా అంటే, అది సెకండ్ హాఫ్ లో వచ్చే నేతలకి సుభాష్ చంద్ర బోస్ కి సంబంధించిన మిస్సింగ్ కేసు ఫైల్ గురించే. నేతాజీ అకస్మాత్తుగా కనిపించకుండా పోవడానికి దశాబ్దాల నుండి కొన్ని వివాదాలు నడుస్తూనే ఉన్నాయి. నేతాజీ సిద్ధాంతాలు, ఇంకా అతని గురించి మనకి తెలియని ఎన్నో అంశాలను చాలా చక్కగా చూపించాడు డైరెక్టర్ గర్రీ BH.

ఇక ప్రొడక్షన్ విలువలు పరంగా చూసుకుంటే పెట్టిన బడ్జెట్ కి ది బెస్ట్ ఆనేలాగానే ఉంటుంది. కానీ బడ్జెట్ కావాల్సినంత మాత్రం పెట్టలేదు అని అనిపిస్తుంది. ఇక ఈ సినిమాలో చాలా సన్నివేశాలు సిల్లీ గా అనిపిస్తాయి, ఖాదిర్ ఖాన్ ఎపిసోడ్స్ ఆశించిన స్థాయిలో రాలేదు. చాలా మామూలుగానే ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ లో మరో సరికొత్త విలన్ ( జిసు సెంగుప్తా) ని పరిచయం చేస్తారు, అది కూడా ఎఫెక్టివ్ గా అనిపించలేదు. మొత్తానికి టేకింగ్ విషయంలో గర్రీ BH దారుణంగా విఫలం అయ్యాడు. ఇక శ్రీచరణ్ అందించిన పాటలు పెద్దగా ఆకట్టుకోలేదు కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం పర్వాలేదు అనే రేంజ్ లో అనిపించింది. ఇక నటీనటుల విషయానికి వస్తే హీరో నిఖిల్ కి ఇలాంటి పాత్రలు చెయ్యడం కొట్టిన పిండితో సమానం, ‘రా ఏజెంట్’ గా ఆయన జీవించేసాడు. ఇక ఐశ్వర్య మీనన్ కూడా NIA ఏజెంట్ గా చాలా చక్కగా నటించింది, జిసు సెంగుప్త పర్వాలేదు అనిపించాడు.

చివరి మాట : భారీ అంచనాలు పెట్టుకోకుండా వెళ్తే సంతృప్తి చెందగలరు, ఒకసారి చూడగల డీసెంట్ స్పై థ్రిల్లర్ ఈ చిత్రం .

రేటింగ్ : 2.5 /5
Nikhil Spy Movie Review || నిఖిల్‌ స్పై యాక్షన్‌ థ్రిల్లర్‌ ఎలా ఉందంటే..? || Oktelugu Entertainment

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Exit mobile version