Second Chance: క్యాబినేట్ కూర్పులో ‘కొత్త’ ట్వీస్ట్.. వారందరికీ సెకండ్ ఛాన్స్ దక్కనుందా?

Second Chance To AP Ministers: ఏపీలో ఇప్పుడు ఎక్కడా చూసినా జగన్ కొత్త క్యాబినెట్ కూర్పు పైనే చర్చ నడుస్తోంది. రాబోయే ఎన్నికలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే సన్నద్దం అవుతుండటంతో కొత్త క్యాబినెట్లో ఎవరెవరు చోటు దక్కించుకుంటారా? అన్న ఆసక్తి నెలకొంది. మిషన్ 2024గా పిలువవడే జగన్ కొత్త క్యాబినేట్ కూర్పు రోజుకో మలుపు తిరుగుతూ సస్పెన్స్ థిల్లర్ మూవీని చూపిస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి అప్పుడే మూడేళ్లు గడిచిపోయింది. రెండున్నరేళ్ల […]

Written By: NARESH, Updated On : April 8, 2022 2:31 pm
Follow us on

Second Chance To AP Ministers: ఏపీలో ఇప్పుడు ఎక్కడా చూసినా జగన్ కొత్త క్యాబినెట్ కూర్పు పైనే చర్చ నడుస్తోంది. రాబోయే ఎన్నికలకు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే సన్నద్దం అవుతుండటంతో కొత్త క్యాబినెట్లో ఎవరెవరు చోటు దక్కించుకుంటారా? అన్న ఆసక్తి నెలకొంది. మిషన్ 2024గా పిలువవడే జగన్ కొత్త క్యాబినేట్ కూర్పు రోజుకో మలుపు తిరుగుతూ సస్పెన్స్ థిల్లర్ మూవీని చూపిస్తోంది.

సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి అప్పుడే మూడేళ్లు గడిచిపోయింది. రెండున్నరేళ్ల తర్వాత జగన్ తన క్యాబినెట్ ను మరోసారి ఉంటుందని ముందుగానే చెప్పారు. అయితే కరోనా పరిస్థితుల కారణంగా నిన్నటి వరకు కూడా జగన్ తన పాత మంత్రులనే కొనసాగించారు. అయితే నిన్ననే మంత్రులంతా రాజీనామా చేయడంతో కొత్త మంత్రివర్గంపై అందరి దృష్టి నెలకొంది.

జగన్ కొత్త క్యాబినేట్ పై ఇప్పటి వరకు అనేక వార్తలు వచ్చాయి. ఈ క్యాబినెట్లో ఒకరిద్దరు మినహా కొత్తవారికే పదవులు దక్కుతాయని ప్రచారం జరిగింది. రాజీనామా చేసిన మంత్రులు సైతం కొత్త క్యాబినెట్లో ఒకరిద్దరు మాత్రమే పాతవారు ఉంటారని క్లారిటీ ఇచ్చారు. దీంతో మంత్రి వర్గంలో కొత్త ముఖాలు ఎక్కువగా ఉంటాయని అంతా భావించారు.

అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ కూర్పుపై అనుహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త క్యాబినెట్లో అంతా కొత్తవారే ఉంటే పాలన కొనసాగించడం ఇబ్బందికరంగా మారుతుందని జగన్ భావిస్తున్నారు. దీంతో పాత క్యాబినెట్లో పనిచేసిన సమర్థులైన ఏడు నుంచి పది మంది మంత్రులకు సీఎం జగన్ సెకండ్ ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అని తెలుస్తోంది.

కొత్త క్యాబినెట్లోనూ జగన్మోహన్ రెడ్డి సామాజిక సమీకరణాలను బేరీజు వేసుకొని కూర్పు చేయనున్నారని సమాచారం. సెకండ్ ఛాన్స్ దక్కించుకునే వారిలో బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పేర్ని నాని, కొడాలి నాని, సీదిరి అప్పలరాజు, చెల్లుబోయిన వేణు, గుమ్మనూరు జయరాం, అంజాద్ భాషా, తానేటి వనిత పేర్లు విన్పిస్తున్నాయి.

బీసీల నుంచి తొమ్మిది మందికి, ఎస్సీల నుంచి ఆరుగురికి, కాపుల నుంచి ముగ్గురికి, రెడ్డిల నుంచి ముగ్గురికి, ఎస్టీల నుంచి ఒకరు, కమ్మ వర్గం నుంచి ఒకరికి, మైనార్టీల నుంచి ఒకరికి అవకాశం ఇవ్వనున్నారు. మొత్తంగా జగన్ క్యాబినెట్లోకి కొత్తగా 14 నుంచి 17 మందికి మాత్రమే ఛాన్స్ దక్కే అవకాశం కన్పిస్తోంది. జగన్ నిర్ణయం ఆశావాహులకు నిరాశను మిగిలిస్తుండగా పాత వారికి మాత్రం వరంగా మారనుంది. దీనిపై ఒకటిరెండ్రోజుల్లో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.