Plane Crash Video: కోస్టారికాలో విమాన ప్రమాదం జరిగింది. బోయింగ్ విమానం రెండుగా చీలిపోయింది. కానీ ఎలాంటి నష్టం సంభవించలేదు. దీంతో అందరు ఊపిరి పీల్చుకున్నారు. విమానం గాల్లో ఉండగానే సాంకేతిక లోపం తలెత్తడంతో పైలట్ అత్యవసర ల్యాండింగ్ కోసం అనుమతి కోరాడు. దీంతో వెంటనే అనుమతి ఇచ్చేశారు. కానీ జువాన్ శాంటమారియా ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ కు అధికారులు ఓకే చెప్పడంతో విమానం సురక్షితంగానే దిగింది.

ఎమర్జెన్సీ ల్యాండింగ్ కావడంతో సమస్యలు తలెత్తేే అవకాశాలున్నాయని జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేశారు. అయినా మెల్లగానే ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నించారు. రన్ వేపై కాస్త దూరం ప్రయాణించిన తరువాత నియంత్రణ కోల్పోయి ప్రమాదవశాత్తు విమానం రెండుగా విడిపోయింది. కానీ ఏ నష్టం జరగలేదు. దీంతో అందరు భయపడినా ఆందోళన పడాల్సిన అవసరం లేదని తెలిసింది.
Also Read: AP Cabinet Expansion: జగన్ కేబినెట్ లో కొత్త వారెందరు? పాత వారెందరు?
విమానంలో సిబ్బందికి ఎలాంటి గాయాలు కాలేదు. ఒక సభ్యుడికి మాత్రం మెడికల్ టెస్టులు చేయించారు. డీహెచ్ఎల్ సంస్థకు చెందిన విమానం కావడంతో ఇది పసుపు రంగులో ఉంది. ఇది వస్తు రవాణా విమానం కావడంతో ప్రయాణికులు లేకపోవడం మంచిదైంది. దీంతో అందులో సరుకులు మాత్రమే ఉండటంతో నష్టం జరగలేదు. గ్వాటెమాల నగరానికి వెళ్తున్న సందర్భంలో సాంకేతిక లోపం ఏర్పడి మధ్యంతరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది.

హైడ్రాలిక్ వ్యవస్థలో లోపం ఏర్పడటంతో ఏవియేషన్ అధికారుల సూచన మేరకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. రన్ వే పై ఉన్న విమానాన్ని తొలగించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటనతో విమానాశ్రయం మూత పడింది. రన్ వేపై విమానం రెండుగా చీలడంతో ప్రయాణికులు ఎయిర్ పోర్టులోనే ఉండాల్సి వచ్చింది. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఐదు గంటల వరకు విమానాల రాకపోకలు జరగలేదు.
