New Parliament Building : సెంట్రల్ విస్టా ప్రాజెక్టులో భాగంగా చేపట్టిన పార్లమెంటు నూతన భవన నిర్మాణం విజయవంతంగా పూర్తి కావడంతో ఇక ఈ ప్రాజెక్టు ను చూసి భరించలేక . వాటిలో వైస్ ప్రెసిడెంట్ ఎన్‌క్లేవ్, కామన్ సెంట్రల్ సెక్రటేరియట్ బిల్డింగ్స్, డిఫెన్స్ ఎన్ క్లేవ్, ఎంపీల చాంబర్లు, ప్రధాన మంత్రి కొత్త నివాసం, కార్యాలయం ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సెంట్రల్ విస్టా ప్రాజెక్టు సహా పార్లమెంటు నూతన భవనం గత కొన్ని సంవత్సరాలుగా పలు న్యాయ సవాళ్లను ఎదుర్కొన్నాయి. 2019, సెప్టెంబరులో ప్రాజెక్టును ప్రకటించగా 2020, డిసెంబరు 10న పార్లమెంటు నూతన భవనానికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు. వీటికి సంబంధించిన కేసులన్నీ సుప్రీం కోర్టు, దిల్లీ హైకోర్టుల్లో ఉన్నాయి. తాజాగా దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంలో పార్లమెంటు కొత్త భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముతో ప్రారంభింపజేసేలా లోక్ సభ సెక్రటేరియేట్‌ను ఆదేశించాలని తమిళనాడుకు చెందిన న్యాయవాది జయసున్ వెకేషన్ బెంచ్ ముందుకు పిల్ దాఖలు చేశారు. దీన్ని విచారించేందుకు జస్టిస్ జేకే.మహేశ్వరి, జస్టిస్ పీఎస్.నరసింహలతో కూడిన ధర్మాసనం నిరాకరించింది.
సెంట్రల్ విస్టా ప్రాజెక్టుతో ప్రజాధనం ఒక్క రూపాయి కూడా వృథా కాదని, పైగా ఏటా రూ.1,000 కోట్ల ప్రజాధనం ఆదా అవుతుందని కేంద్రం తెలిపింది. ఈమేరకు సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కూడా నూతన పార్లమెంటు భవన నిర్మాణాన్ని సమర్థించారు. వందేళ్ల క్రితం నాటి ప్రస్తుత పార్లమెంట్ భవనం అనేక సమస్యలకు నిలయంగా మారిందని తెలిపారు. భద్రతా సమస్యలు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. సభ్యులు, స్పీకర్లు కూడా ఈ విషయాన్ని తెలిపారని వెల్లడించారు.
ప్రజాస్వామ్య దేవాలయంగా నూతన పార్లమెంట్‌ను, అన్నివర్గాల ప్రజల కొత్త గృహంగా ప్రముఖులు నూతన పార్లమెంట్‌ను కీర్తిస్తుంటే కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు, రాష్ట్రీయ జనతాదళ్ పార్టీలు మాత్రం విమర్శలు చేస్తున్నాయి.. కొత్త పార్లమెంట్ భవనం నమూనాను శవపేటికతో పోల్చింది బీహార్ కు చెందిన రాష్ట్రీయ జనతాదళ్ . వైపరీత్య బుద్దితో మోడీకి క్రెడిట్ రాకుండా ఉండేందుకు చేస్తున్న విమర్శలు కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలపై నెటిజన్లు మండిపడుతున్నారు.
కొత్త పార్లమెంట్ పై ప్రతిపక్షాల విమర్శలపై ‘రామ్’గా రి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.