Virupaksha collections : ‘విరూపాక్ష’ క్లోసింగ్ కలెక్షన్స్..తెలుగు లో బంపర్ హిట్..హిందీ లో డిజాస్టర్ ఫ్లాప్!

ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 22 కోట్ల రూపాయలకు జరగగా ఫుల్ రన్ లో 48 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. అంటే పెట్టిన డబ్బుకి రెండింతలు పైగానే లాభాలను రాబట్టింది అన్నమాట. ఇక్కడ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ఈ చిత్రం హిందీ లో మాత్రం పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. అక్కడ ఈ సినిమా కనీసం ఒక్క రూపాయి షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది.

Written By: NARESH, Updated On : May 30, 2023 8:40 pm

Virupaksha Collections

Follow us on

Virupaksha collections :సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన ‘విరూపాక్ష’ చిత్రం రీసెంట్ గానే విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద బంపర్ హిట్ గా నిల్చిన సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత ఆడియన్స్ కి ఒక మంచి హారర్ థ్రిల్లర్ సినిమాని థియేటర్స్ లో చూసిన అనుభూతిని కలిగించింది ఈ చిత్రం. ఈ సమ్మర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ కూడా అదే.

ఈ చిత్రం ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపుగా 22 కోట్ల రూపాయలకు జరగగా ఫుల్ రన్ లో 48 కోట్ల రూపాయలకు పైగా షేర్ వసూళ్లను రాబట్టింది. అంటే పెట్టిన డబ్బుకి రెండింతలు పైగానే లాభాలను రాబట్టింది అన్నమాట. ఇక్కడ ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చిన ఈ చిత్రం హిందీ లో మాత్రం పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ గా మిగిలింది. అక్కడ ఈ సినిమా కనీసం ఒక్క రూపాయి షేర్ వసూళ్లను కూడా రాబట్టలేకపోయింది.

ఇక్కడ ప్రాంతాల వారీగా ఒకసారి ఈ చిత్రం రాబట్టిన వసూళ్లను చూద్దాం. ఈ సినిమాకి జాక్పాట్ లాగ కలిసొచ్చిన ప్రాంతం ఏదైనా ఉందా అంటే అది నైజాం ప్రాంతం అని చెప్పొచ్చు . అక్కడ ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 7 కోట్ల రూపాయలకు జరగగా, ఫుల్ రన్ లో 16 కోట్ల 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టింది. ఆ తర్వాత సీడెడ్ లో 5 కోట్ల 60 లక్షల రూపాయిలు, ఉత్తరాంధ్ర లో 5 కోట్ల 30 లక్షల రూపాయిలు వసూలు చేసింది.

ఇక కృష్ణ జిల్లాలో రెండున్నర కోటి రూపాయిల వసూళ్లను రాబట్టిన ఈ సినిమా, నెల్లూరు జిల్లాలో కోటి 30 లక్షల రూపాయిల షేర్ ని రాబట్టి, సాయి ధరమ్ తేజ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిల్చింది. అలా ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతాలకు కలిపి 38 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసిన ఈ సినిమా, ప్రపంచవ్యాప్తంగా అన్నీ ప్రాంతాలకు కలిపి 48 కోట్ల రూపాయిల షేర్ ని వసూలు చేసింది.