ఫోన్ నంబర్ బ్లాక్ అవుతుందని మెసేజ్ వచ్చిందా.. తస్మాత్ జాగ్రత్త..!

ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు మోసాలు చేయడానికి కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఒక మోసం వెలుగులోకి వస్తే మరో విధంగా మోసాలు చేస్తున్నారు. మరి కొందరు సైబర్ మోసగాళ్లు పాత మోసాలనే మరో విధంగా చేస్తూ అమాయకుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. దేశంలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో ప్రజలు సైబర్ మోసాల బారిన పడి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. Also Read: కంప్యూటర్ కీ బోర్డుపై అక్షరాలు వరుస క్రమంలో […]

Written By: Navya, Updated On : February 5, 2021 3:53 pm
Follow us on

ఈ మధ్య కాలంలో సైబర్ నేరగాళ్లు మోసాలు చేయడానికి కొత్త మార్గాలను ఎంచుకుంటున్నారు. ఒక మోసం వెలుగులోకి వస్తే మరో విధంగా మోసాలు చేస్తున్నారు. మరి కొందరు సైబర్ మోసగాళ్లు పాత మోసాలనే మరో విధంగా చేస్తూ అమాయకుల బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. దేశంలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో ప్రజలు సైబర్ మోసాల బారిన పడి సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు.

Also Read: కంప్యూటర్ కీ బోర్డుపై అక్షరాలు వరుస క్రమంలో ఎందుకుండవో తెలుసా..?

మోసగాళ్లు బ్యాంకు ఖాతా ఖాళీ చేసిన తరువాత వాళ్ల అకౌంట్లలోకి వచ్చిన డబ్బును వెంటనే విత్ డ్రా చేయడం లేదా మరో బ్యాంకు ఖాతాకు బదిలీ చేయడం లేదా ఆ డబ్బుతో ఖరీదైన వస్తువులను కొనుగోలు చేయడం చేస్తున్నారు. సైబర్ మోసగాళ్లు ఎక్కువగా ఆఫర్లు, బహుమతుల పేరుతో సందేశాలు పంపి సైబర్ మోసాలకు పాల్పడుతూ ఉండటం గమనార్హం. ఈ మధ్య కాలంలో మరో కొత్తరకం మోసం వెలుగులోకి వచ్చింది.

Also Read: రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త.. రుణాలు మాఫీ..?

సైబర్ మోసగాళ్లు ఫోన్ నంబర్ బ్లాక్ అవుతుందని అమాయక ప్రజలకు ఫేక్ మెసేజ్ లు పెడుతున్నారు. ఆ తరువాత మొబైల్ నంబర్ బ్లాక్ కాకుండా ఉండాలంటే ఎనీ డెస్క్ యాప్ లేదా ఇతర యాప్ లను డౌన్ లోడ్ చేసుకోవాలని సూచిస్తారు. యాప్ లను డౌన్ లోడ్ చేస్తే మాత్రం ఖాతాలో డబ్బులు మాయమయ్యే అవకాశాలు ఉంటాయి. సైబర్ మోసగాళ్లు ప్రధానంగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, కస్టమర్ల బ్యాంకు ఖాతాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.

మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

హైదరాబాద్ పోలీసులు ఇప్పటికే ఇలాంటి మోసాలపై దృష్టి పెట్టారు. సైబర్ మోసగాళ్ల మాయమాటలు నమ్మి మోసపోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. సైబర్ మోసాలపై అవగాహన పెంచుకుంటే మాత్రమే ఈ తరహా మోసాల బారిన పడకుండా జాగ్రత్త పడవచ్చు.