https://oktelugu.com/

సోము వీర్రాజుకున్న దమ్ము వైసీపీ, టీడీపీకి ఉందా?

ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా సంచలన సవాల్ చేశారు. తాజాగా పల్నాడు నుంచి  పార్టీలో కొందరు నాయకుల చేరిక సందర్భంగా సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము బీజేపీ నుంచి ఒక బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని.. ఈ వెసులుబాటు వైసీపీ, టీడీపీ నుంచి ఉన్నాయా? అని ప్రశ్నించారు. బీసీ నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేసే సామర్థ్యం కేవలం కమలం పార్టీకి మాత్రమే […]

Written By:
  • NARESH
  • , Updated On : February 5, 2021 / 03:26 PM IST
    Follow us on

    ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు తాజాగా సంచలన సవాల్ చేశారు. తాజాగా పల్నాడు నుంచి  పార్టీలో కొందరు నాయకుల చేరిక సందర్భంగా సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తాము బీజేపీ నుంచి ఒక బీసీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు ఉన్నాయని.. ఈ వెసులుబాటు వైసీపీ, టీడీపీ నుంచి ఉన్నాయా? అని ప్రశ్నించారు. బీసీ నాయకుడిని ముఖ్యమంత్రి అభ్యర్థిగా చేసే సామర్థ్యం కేవలం కమలం పార్టీకి మాత్రమే ఉందని.. ఈ రెడ్డి, కమ్మల పార్టీలకు లేదని  బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు స్పష్టం చేశారు. .

    వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బడుగు బలహీన వర్గా, షెడ్యూల్ కులాల వారు   ముఖ్యమంత్రులుగా బీజేపీ నుంచి కావచ్చని సోము వీర్రాజు భరోసానిచ్చారు. దమ్ముంటే అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీలు అలా చేయగలవా? అని సోము వీర్రాజు సవాల్ చేశారు. అయితే దీనిపై టీడీపీ కొన్ని మీడియా వర్గాలు రాద్ధాంతం చేస్తున్నాయి. సోము వీర్రాజు బీసీలకే ముఖ్యమంత్రి పదవి అన్నారని తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. టీడీపీ, దాని అనుకూల మీడియా కోడిగుడ్డు ఈకలు పీకినట్టు రచ్చ చేస్తున్నాయి.

    బీసీలకు బీజేపీ ముఖ్యమంత్రి పదవి అని సోము వీర్రాజు అనకున్నా.. దాన్నే పట్టుకొని కొన్ని మీడియా రాద్ధాంతం చేస్తున్నాయి. బీజేపీలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చని సోము వీర్రాజు చేసిన ప్రకటనను తప్పుగా తీసుకెళుతున్నాయి. వచ్చే 2024లో ఏపీలో బీజేపీ-జనసేన కూటమి అధికారంలోకి వస్తే ఇటు సోము వీర్రాజు కానీ.. అటు పవన్ కళ్యాణ్ కానీ సీఎం అభ్యర్థులుగా ఉండరని ప్రచారం చేస్తున్నాయి.. ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఏకంగా అధికారం కోసం ముఖ్యమంత్రి సీటునే త్యజించాడని వార్తలు వ్యాపింపచేస్తున్నాయి..

    ఇప్పటికే జనసేనాని పవన్ కళ్యాణ్ పొత్తులో ఒకవేళ బీజేపీ-జనసేన అధికారంలోకి వస్తే తనే సీఎం అని కలలుగంటున్నారని…కానీ సోము వీర్రాజు చేసిన ప్రకటనతో ఇక పవన్ సీఎం ఆశలు నెరవేరవు అని టీడీపీ మీడియా హోరెత్తిస్తోంది. పవన్ కళ్యాన్ కు సోము వీర్రాజు పొగబెట్టారని రాసుకొస్తున్నాయి.

    నిజానికి బీసీలకు, ఎస్సీలు కూడా బీజేపీలో సీఎం కావచ్చన్నదే  సోము వీర్రాజు అన్న మాట..  దాన్ని సవాల్ చేయడానికి వైసీపీ, టీడీపీ అలా చేయాలని ఆయన చెప్పుకొచ్చారు. కానీ అగ్ర సామాజికవర్గాలు పాలిస్తున్న వారి పార్టీలు కావాలనే బీసీలకు ఈ పదవి దక్కకుండా పవన్ ను బూచీ చూపి విభేదాలు ఉసిగొల్పేలా వ్యవహరిస్తున్నాయని అర్థమవుతోంది.

    మరి ఇప్పటికైనా సోము వీర్రాజు సవాల్ ను ఈ టీడీపీ, వైసీపీ లు స్వీకరిస్తారా? బీజేపీలో లాగా బీసీలను సీఎం క్యాండిడేట్లుగా చేసే మలిచే దమ్ము ఆ పార్టీలకు ఉందా అన్న ప్రశ్న ఉదయిస్తోంది.  పవన్ కు పొగబెట్టాడని జరుగుతున్న ఈ ప్రచారం వెనుక పెద్ద కుట్ర ఉందని.. బీసీ సామాజికవర్గాలకు  ఆ ఆశ దక్కకుండా చేయాలని వైసీపీ, టీడీపీ నేతలు ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారని అర్థమవుతోంది.