AP Women’s Commission : మహిళా కమిషన్ అంటే మహిళలకు అన్యాయం జరిగినప్పుడు.. మహిళలను కించపర్చేలా ఎవరైనా మాట్లాడినప్పుడు, మహిళల హక్కులకు భంగం వాటిల్లినప్పుడు బాధితులకు రక్షణ కల్పించాలి. హక్కులను కాపాడాలి.. న్యాయ సహాయం అందించాలి.. ఇందుకు బాధ్యులైనవారిపై చట్టపరమైన చర్య తీసుకోవాలి. ఏ రాష్ట్రంలోనైనా మహిళా కమిషన్ చేయాల్సింది ఇదే. కానీ ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం మహిళా కమిషన్ ఇందుకు భిన్నం వ్యవహరిస్తోంది. రాజకీయ ప్రేరేపితంగా పనిచేస్తోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ కేవలం ప్రభుత్వ ఆదేశాల మేరకు మాత్రమే పనిచేస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. స్వతంత్రంగా పనిచేయాల్సిన చైర్‌పర్సన్ అధికార పార్టీకి కొమ్ముకాస్తూ, అధికార పార్టీ నేతలను ప్రభుత్వాలను విమర్శించేవారికి నోటీసులు ఇవ్వడమే ఇందుకు కారణం. అధికార పార్టీ నేతలు మహిళలను కించపర్చినప్పుడు, మహిళల హక్కులకు భంగం కలిగించినప్పుడు మౌనం వహించడం, విపక్షాలు మాట్లాడినప్పుడు చర్యలకు దిగడం రాజకీయ ప్రేరేపితంగా పనిచేస్తుందన్న ఆరోపణలకు బలం చేకూరుస్తోంది.
-ఎవరినీ ఉద్దేశించి మాట్లాడకున్నా నోటీసులు..
ఇటీవల మంగళగిరిలో నిర్వహించిన జనసేన పార్టీ కార్యకర్తల సమావేశంలో ఆ పార్టీ అధినేత అధినేత పవన్ కళ్యాణ్ తన మూడు పెళ్లిళ్లపై ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అసహనానికి గురై ఎదురు దాడికి దిగారు. ఈ సందర్భంగా మీరు కూడా మూడు పెళ్లిళ్లు చేసుకోండి అని వ్యాఖ్యానించాడు. ఇది అధికార వైసీపీ నాయకులను ఉద్దేశించి మాట్లాడినవే. ఏ మహిళనూ ఉద్దేశించి వ్యక్తిగతంగా చేసినవి కావు. కానీ ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ మాత్రం మూడు పెళ్లిళ్ల వ్యాఖ్యలను పవన్ తక్షణమే వెనక్కి తీసుకోవాలని నోటీసులు జారీ చేశారు. మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ‘భరణం ఇస్తే భార్యను వదిలించుకోవచ్చు అనే సందేశాన్ని.. మీరు ఇస్తూ మాట్లాడిన తీరుతో మహిళా లోకం షాక్‌కు గురైంది’ అని పేర్కొన్నారు. ఓ పార్టీకి అధ్యక్షుడిగా, సినిమా హీరోగా ఉండి ఇలాంటి సందేశం ఇవ్వడం దేనికి సంకేతం అని ప్రశ్నించారు.

-ఆ నాడు లేవని నోరు ఇప్పుడే ఎందుకు లేస్తోంది..
జనసేనానికి ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తంవుతున్నాయి. కేవలం రాజకీయ ప్రేరేపితంగా మాత్రమే మహిళా కమిషన్ చైర్‌సర్పన్ వాసిరెడ్డి పద్మ పనిచేస్తున్నారని జనసైనికులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు జనసైనికులు, జనసేన పార్టీ ట్వీట్లతో వాసిరెడ్డి పద్మపై యుద్ధం ప్రకటించింది. ఏపీలో మహిళలపై దాడులను ప్రస్తావిస్తూ ట్వీట్లతో కడిగిపారేస్తున్నారు. తమ నాయకుడు వ్యక్తిగతంగా ఎవరినీ ఉద్దేశించి వ్యాఖ్యలు చేయలేదని, తన పెళ్లిళ్ల గురించి మాత్రమే మాట్లాడారని పేర్కొంటున్నారు. అయినా.. జనసేన ఏపీలో బలోపేతం అవుతుందన్న కారణంగానే, పార్టీ ప్రతిష్టను డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్‌కు ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసిందని పేర్కొంటున్నారు. అధికార వైసీపీ నాయకులు ప్రతిపక్ష పార్టీల మహిళా నేతలను కించపర్చినప్పుడు, ప్రతిపక్ష నేతల కుటుంబ సభ్యులు, భార్యలను ఉద్దేశించి అసెంబ్లీ సాక్షిగా విమర్శలు చేసినప్పుడు, వ్యక్తిగతంగా ధూషణలకు దిగినపుపడు ఏపీ మహిళా కమిషన్ ఏం చేసిందని ప్రశ్నిస్తున్నారు.
– వైరల్ అవుతున్న ట్వీట్లు..
ఏసీ మహిళా కమిషన్ పవన్ కళ్యాణ్‌కు నోటీసులు జారీ చేసిన క్రమంలో ప్రస్తుతం ఒక ట్వీట్ దేశవ్యాప్తంగా వైర ల్ అవుతూ ఏపీ మహిళా కమిషన్‌ను షేక్ చేస్తోంది. ఆ టీట్ సారాంశం.. ట్విట్టర్ లో ఏపీ మహిళ కమిషన్ కు వ్యతిరేకంగా జనసైనికులు, ఇతరులు చేస్తున్న ట్వీట్ల యుద్ధం ట్రెండింగ్ గా మారింది. అనేక ట్వీట్లతో ఏపీ మహిళా కమిషన్ ను ట్రోల్ చేస్తూ ట్రెండ్ చేస్తున్నారు. ‘‘ పవన్‌కళ్యాణ్ అమ్మ అంజనమ్మను తిట్టినప్పుడు?,
-చంద్రబాబు భార్య గురించి మాట్లాడినప్పుడు?
కళ్యాణ్‌గారి ఇంట్లో ఆడవాళ్లను బోరుగడ్డ అనిల్ అనేవాడు బహిరంగంగా రేప్ చేస్తా అని వీడియో పెట్టినప్పుడు? పనిచేయని ఏపీ కమిషన్? నేను విడాకులు ఇచ్చి పెళ్లిళ్లు చేసుకున్న అంటే తప్పు అంటా’’ అని ఉంది. ఇదే కాదు.. జనసేన నేతల బోలెడు ట్వీట్లు ఇప్పుడు జాతీయ స్థాయిలో ట్రెండింగ్‌లో ఉన్నాయి.. ఈ ట్వీట్‌ను ఏపీ మహిళా కమిషన్‌కు ట్యాగ్ చేస్తూ నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
నాడు ఏపీ మహిళా కమిషన్ ఎందుకు మౌనం వహించిందని ప్రశ్నిస్తున్నారు. అసెంబ్లీ వేదికగా చంద్రబాబు భార్య నారా భువనేశ్వరి గురించి వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు మాట్లాడినప్పుడు స్వతంత్రంగా పనిచేయాల్సిన మహిళా కమిషన్ ఎందుకు స్పందించలేదని నిలదీస్తున్నారు. బహిరంగంగా రేప్ చేస్తా అన్నవాడికి ఎందుకు నోటీసులు ఇవ్వలేదు. చట్టపరంగా ఎందుకు చర్య తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. నాడు ఆయా నాయకులు మాట్లాడిన మాటల వీడియోను కూడా ట్యాగ్ చేస్తున్నారు. దీంతో ఏపీ మహిళా కమిషన్ షేక్ అవుతోంది. మొత్తంగా నెటిజన్లు, పవన్ అభిమానులు, నెటిజన్లు ఏపీ మహిళా కమిషన్‌ను ఉతికి ఆరేస్తున్నారు.
