Natraj Master Allegations On Bindu: ‘బిగ్ బాస్ హౌస్’లో పురుష ఆధిపత్యాన్ని తుత్తునియలు చేయడానికి, నడుం బిగించి విజయభేరీ మోగించింది ‘భిందు మాధవి’. ప్రేక్షక లోకం కూడా, అంతే ఘనంగా ఆమెను ఆదరించింది. ఐతే, స్వయం ప్రకటిత మేధావి ‘నటరాజ్ మాస్టర్ కి లోకం తీరు ఎలా ఉన్నా.. తన బాణాలు మాత్రం భిందు మాధవి మీద వేయాల్సిందే. తెల్లారి లేస్తే భిందు మాధవిని విమర్శించడమే పనిగా పెట్టుకున్న ఈ పైత్యపు మాస్టర్, ఎప్పటికప్పుడు తన మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఎలుక ఎంత ఏడ్చినా, పిల్లి కనికరిస్తుందా ?.. భిందు మాధవి పై నటరాజ్ ఏడుపు కూడా అలాగే ఉంది. ఆర్నెల్లు కర్రసాము నేర్చి, మూలనున్న ముసలవ్వ పై ప్రతాపం చూపినట్టు.. ‘బిగ్ బాస్’ హౌస్ లో చేతులు ఎత్తేసి.. యూట్యూబ్ ఇంటర్వ్యూస్ లో పిచ్చి వాగుడుతో రెచ్చిపోతే ఉపయోగం ఏముంది ?

అసలు, ‘బిగ్ బాస్ నాన్ స్టాప్’ షో ముగిసినా.. కంటెస్టెంట్ ల మధ్య మాటల యుద్దానికి మాత్రం ముగింపు లేకుండా పోయింది. భిందు మాధవి పీఆర్ టీమ్ చీట్ చేసిందని, సోషల్ మీడియా అకౌంట్ మేనేజ్ చేయాల్సిన ఆమె పీఆర్ టీమ్, అందుకు విరుద్ధంగా పని చేసిందని, భిందు గేమ్ ఆడకపోయినా ఆడినట్లు భ్రమ కల్పిస్తూ.. దొంగ ఓట్లు వేయించారని నటరాజ్ కొత్త మూలుగులు మూలుగుతున్నాడు. ‘భిందు మాధవి’ పై ఎదురు తిరిగిన వ్యక్తులతో పాటు వారి కుటుంబాలను కూడా అసభ్యకరమైన మాటలతో హింసించారని నటరాజ్ ఆవేశంతో ఊగిపోయాడు. ముఖ్యంగా తన కుటుంబాన్ని, అఖిల్ కుటుంబాన్ని, మిత్రా కుటుంబాన్ని భిందు మాధవి టీమ్ టార్గెట్ చేసి ఇబ్బంది పెట్టిందని నటరాజ్ అన్నాడు. కుటుంబాలను లాగాల్సిన అవసరం ఏమొచ్చింది ? అంటూ నటరాజ్ మాస్టర్ కపటి నీతులను లేవనెత్తుతున్నాడు.
Also Read: Pawan Kalyan Love Story: పవన్ కళ్యాణ్ జీవితంలో దాచేసిన ఆ ప్రేమ కథ ఇదీ!
అలాగే, భిందు మాధవి ఆడపులి అనే మాటను ముందే ఫిక్స్ అయి, హౌస్ లోకి వచ్చిందట. ఎనిమిదో వారానికి ప్రేక్షకులందరి మెదడులో ఆడపులి అనే పదాన్ని రిజిస్టర్ చేయడంలో భిందు టీమ్ సక్సెస్ సాధించారని నటరాజ్ దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడు. అంతేగాక సిగరెట్ కూడా తాగి గుడ్డు పగలగొట్టి వాసన రాకుండా భిందు మాధవి మేనేజ్ చేసేదని నటరాజ్ మళ్లీ పాత టాపికే బలంగా వినిపించే ప్రయత్నం చేశాడు. పైగా భిందు మాధవి టీం సభ్యులు కలిసి మాట్లాడుకున్న స్క్రీన్ షాట్స్ కూడా తన దగ్గర ఉన్నాయని.. కావాలంటే చూపిస్తా అంటూ కేఏ పాల్ కి కజిన్ బ్రదర్ లా కామెడీ పాలు అయ్యాడు.

ఇక బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాక, తనను రాళ్లతో కొట్టాలని అనుకుంటున్నారని నటరాజ్ అంటే… అసలు కొట్టే దాకా ఎందుకు వచ్చింది అని యాంకర్ ప్రశ్నించింది. భిందు మాధవి ఫేక్ ఇమేజ్ ను, చీటింగ్ ను నేను బట్టబయలు చేసేలా మాట్లాడుతున్నాను. అందుకే, వాళ్ళు నా మీద పగ బట్టి ఉండవచ్చు’ అంటూ నటరాజ్ మాస్టర్ చెప్పుకొచ్చాడు. నటరాజ్ కామెంట్స్ చూసాక.. ఎవరైనా పుణ్యం కట్టుకొని ఈ మాస్టర్ ని డాక్టర్ కి చూపించండర్రా !’ అంటూ నెటిజన్లు కూడా మాస్టర్ ను ట్రోల్ చేస్తున్నారు. ఊరుకోవడమంత ఉత్తమం, బోడి గుండంత సుఖం లేదు అని నటరాజ్ ఇప్పటికైనా తెలుసుకుంటే బెటర్.
Also Read:Rajamouli Advice For Pushpa: రాజమౌళి ఇచ్చిన ఆ సలహా వల్లే పుష్ప ఇంత పెద్ద హిట్ అయ్యిందా!
Recommended videos
[…] […]
[…] […]