Nagarjuna Remuneration : అతి పెద్ద తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్. బిగ్ బాస్ కి ఉన్న ఆదరణ గురించి ఎంత చెప్పినా తక్కువే. హిందీలో పదిహేనేళ్ల క్రితం మొదలైన బిగ్ బాస్ అన్ని ప్రాంతీయ భాషలకు వ్యాపించింది. బిగ్ బాస్ షో ను ఎంత ఇష్టపడతారో అంతే విధంగా విమర్శిస్తారు. తెలుగులో ప్రస్తుతం కింగ్ నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు. మరి తెలుగు బిగ్ బాస్ హోస్ట్స్ రెమ్యూనరేషన్ ఎంతో తెలిస్తే నిజంగా మైండ్ బ్లాక్ కావాల్సిందే.
బిగ్ బాస్ సీజన్ 1 వ్యాఖ్యాతగా వ్యవహరించిన జూ. ఎన్టీఆర్ అటు నటన పరంగా ఇటు హోస్టింగ్ పరంగా మంచి మార్కులే కొట్టాడు. చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే జూ.ఎన్టీ ఆర్ కోసం నిర్వాహకులు బిగ్ బాస్ సెట్ ని పూణె లో వేశారు. ఎందుకంటే అప్పుడు జై లవ కుశ మూవీలో నటిస్తున్నాడు తారక్. షెడ్యూల్ పరంగా షూటింగ్ కి ఇబ్బంది రాకూడదని షో నిర్వాహకులు భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అలా తారక్ ఒక్కో ఎపిసోడ్ కి 50 లక్షలు తీసుకున్నాడని వినికిడి.
నాచ్యురల్ స్టార్ గా అభిమానుల్లో తనకంటూ ఒక స్థానాన్ని ఏర్పరచుకున్నాడు నాని. అటు వెండితెర లో తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించి అశేష అభిమానులను సంపాదించుకున్న నాని ఇటు బుల్లితెరపై బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ గా వ్యవహరించాడు. మరి నాని రెమ్యునరేషన్ బిగ్ బాస్ లో ఎంతంటే ఒక్క ఎపిసోడ్ 10 లక్షలు అని టాక్.
సీజన్ 3 నుండి హోస్ట్ గా మారిన నాగార్జునకు ఎపిసోడ్‌కు రూ.12 లక్షల చొప్పున నిర్వాహకులు ఇచ్చారట. నాలుగో సీజన్‌లో మొత్తం ఎపిసోడ్‌లు అన్నింటికీ కలిపి నాగ్ రూ.8 కోట్లు అందుకున్నారట. తాజాగా 7వ సీజన్‌కు వచ్చేసరికి నాగ్ రెమ్యునరేషన్ అమాంతం పెరిగినట్టు తెలుస్తోంది. ప్రస్తుత సీజన్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నందుకు నాగార్జున మొత్తం రూ.12 కోట్లు అందుకోబోతున్నారు అని సమాచారం.