Nagababu vs Jagan : ప్యాకేజీ.. ప్యాకేజీ.. ప్యాకేజీ.. ఆంధ్రా రాజకీయాల్లో తరచూ వినిపించే పదం. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఎక్కడ మీటింగ్ పెట్టినా ఈ పదం వాడకుండా సభ ముగియదంటే అతిశయోక్తి కాదు. వైసీపీ ముక్త ఆధ్రప్రదేశ్ లక్ష్యంగా పనిచేస్తున్న జనసేన అధినేత పవన్ టార్గెట్‌గా వైసీపీ తరచూ వాడే పదం ప్యాకేజీ. దీనిపై ఒకానొకదశలో పవన్ కూడా ఘాటుగా స్పందించారు. తనను ప్యాకేజీ స్టార్ అంటే.. తాను చెంచల్‌గూడ అల్లుడు అని అంటానని హెచ్చరించాడు. అయినా ముఖ్యమంత్రి జగన్ నుంచి మొదలు.. వైసీపీ మంత్రులు.. ఎమ్మెల్యేలు కూడా ప్యాకేజీ పదం లేకుండా ప్రెస్‌మీట్ పెట్టడం లేదు.
జనసేన కౌంటర్ ఎటాక్..
ఇన్నాళ్లూ ఓపిక వహిస్తూ వచ్చిన జనసేన.. ఇక ప్యాకేజీకి కౌంటర్ మొదలు పెట్టింది. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పవన్ సోదరుడు నాగబాబు సోషల్ మీడియా వేదికగా కౌంటర్ మొదలు పెట్టాడు. ఇందుకోసం ప్రత్యేక ఇంటర్వ్యూ ప్లాన్ చేశాడు. జనసేన పార్టీ కార్యాలయంలోనే ప్యాకేజీపై ఇచ్చి పడేశాడు.
ప్యాకేజీ అంటే..
అసలు ప్యాకేజీ అంటే ఏమిటి అని నాగబాబు ప్రశ్నించారు. అసలు ప్యాకేజీ అంటే ఏంటి అని నాగబాబు ప్రశ్నించాడు. దీనికి ఇచ్చిన కౌంటర్ జగన్ దిమ్మ తిరిగిపోయేలా ఉంది. ముక్కు మొహం తెలియని వ్యక్తిని తీసుకు వచ్చి.. రాజ్యసభ టికెట్ ఇచ్చి.. ఎంపీని చేయడం అసలు ప్యాకేజీ అని సమాధానం ఇచ్చాడు. ఏం ప్యాకేజీ తీసుకోకుండానే జగన్ మన రాష్ట్రం కానివాడికి ఎంపీ ఇచ్చాడా అని ప్రశ్నించాడు. ఎంపీని చేసినందుకు ఆయన ఏపీ ప్రజల గురించి కానీ, ఏపీ అభివృద్ధి, నిధుల గురించి కేంద్రాన్ని ఏమైనా అడిగాడా అంటే అదీ లేదు. ఇదీ అసలైన ప్యాకేజీ అని గట్టిగా ఇచ్చాడు. ప్యాకేజీ తీసుసోవడం అంటే ఇదీ అని పేర్కొన్నాడు. ఇలా సూట్‌కేస్ వచ్చింది.. అలా ఎంపీని చేశాడు అని తెలిపాడు.
ప్యాకేజీ ఇవ్వడం కూడా…
ప్యాకేజీ పుచ్చుకోవడమే కాదు.. ప్యాకేజీ తీసుకోవడం లోనూ ఆయన దిట్ట అని సమాధానం ఇచ్చాడు నాగబాబు. అదెలా అంటే వైఎస్.రాజశేఖరరెడ్డి మరణించినప్పుడు తనను ముఖ్యమంత్రిని చేయాలని గడప తొక్కని పార్టీ కార్యాలయం లేదు. తండ్రి శవం అక్కడ ఉండగానే ఆయన తనకు మద్దతుగా ఎమ్మెల్యేల సంతకాలు సేకరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ క్రమంలో నాగబాబు బయట పెట్టిన వీడియోలో.. జమ్ముకశ్మీర్ మాజీ సీఎం ఫారూఖ్ అబ్దుల్లా వీడియో దిమ్మ తిరిగేలా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావడానికి జగన్‌రెడ్డి కాంగ్రెస్‌కు రూ.1,500 కోట్లు ప్యాకేజీగా ఇవ్వడానికి సిద్ధమయ్యాడని ఫారూఖ్ వెల్లడించాడు. అంత డబ్బు జగన్‌కు ఎక్కడి నుంచి వచ్చింది.. అలా ప్యాకేజీ ఇచ్చి వచ్చిన వాడు రాష్ట్రానికి ఏం చేస్తాడు అని ప్రశ్నించాడు. తన భవిష్యత్‌ను బాగు చేసుకుని జనాన్ని నాశనం చేస్తాడు అని పేర్కొన్నాడు.
దీంతో స్పందించిన నాగబాబు.. ఇదికదా ప్యాకేజీ అంటే అని అన్నాడు. ప్యాకేజీకి బ్రాండ్ అంబాజిడర్ అయిన ఆయన ఇతరులను ప్యాకేజీ స్టార్ అనడమే హాస్యాస్పదంగా ఉందని వెల్లడించారు. నిజమే కదా.. ప్యాకేజీ తీసుకోవడం, ప్యాకేజీ ఇవ్వడంలో ముందు వరుసలో ఉన్న వ్యక్తి.. ఇతరులను ప్యాకేజీ స్టార్ అనడంపై ఆంధ్రా ప్రజలు ఆలోచనలో పడ్డారు.