Naa Saami Ranga Trailer: నా సామిరంగ ట్రైలర్ రివ్యూ: నాగ్ ఊరమాస్ అవతార్, పక్కా సంక్రాంతి మూవీ!

జనవరి 14న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. నేడు చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. రెండున్నర నిమిషాల ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇది విలేజ్ పొలిటికల్ డ్రామా. రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్ కలగలిపి పక్కా సంక్రాంతి సినిమాగా తెరకెక్కించాడు.

Written By: NARESH, Updated On : January 9, 2024 4:33 pm

Naa Saami Ranga Trailer

Follow us on

Naa Saami Ranga Trailer: సంక్రాంతి బరిలో నిలవాలని చకచకా షూటింగ్ పూర్తి చేశాడు నాగార్జున. రెండు మూడు రోజుల క్రితమే నా సామిరంగ యూనిట్ గుమ్మడి కాయ కొట్టారు. జనవరి 14న వరల్డ్ వైడ్ విడుదల చేస్తున్నారు. నేడు చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. రెండున్నర నిమిషాల ట్రైలర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ఇది విలేజ్ పొలిటికల్ డ్రామా. రొమాన్స్, కామెడీ, ఎమోషన్స్ కలగలిపి పక్కా సంక్రాంతి సినిమాగా తెరకెక్కించాడు.

నా సామిరంగ చిత్రంలో నాగార్జున కిష్టయ్య అనే పాత్ర చేస్తున్నాడు. ఊరిలో కిష్టయ్య అంటే ఒక హీరో. అతనికి ఎదురెళ్ళే ధైర్యం చేసే మగాడు లేడు. కత్తి పడితే ఊచ కోతే. ఇక కిష్టయ్య మిత్రులుగా అంజి(అల్లరి నరేష్), భాస్కర్ (రాజ్ తరుణ్) నటిస్తున్నారు. ఈ ముగ్గురు మిత్రుల చుట్టే కథ నడుస్తుంది. పల్లెటూరి పెద్దల మధ్య కక్షలు, కార్పణ్యాలు, పండగలు, సాంప్రదాయాలు, వాటి చుట్టూ అల్లుకున్న ఆధిపత్య పోరే నా సామిరంగ.

నాగార్జున రోల్, క్యారెక్టరైజేషన్ మాస్ గా ఉన్నాయి. ఈ మధ్య కాలంలో ఈ తరహా రోల్ నాగార్జున చేయలేదు. సోగ్గాడే చిన్నినాయనా అనంతరం మరోసారి ఆ తరహా రోల్ చేశాడు. ఇక అల్లరి నరేష్, రాజ్ తరుణ్ సపోర్టింగ్ రోల్స్ చేశారు. వీరికి కూడా హీరోయిన్స్, రొమాన్స్ వంటి అంశాలు ఉన్నాయి. నా సామిరంగ చిత్రంలో ఆషిక రంగనాథ్, మిర్నా మీనన్, రుక్షర్ థిల్లాన్ హీరోయిన్స్ గా నటించారు. వారి పాత్రలు ఆసక్తి రేపుతున్నాయి.

మొత్తంగా ట్రైలర్ ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు పెంచేసింది. సంక్రాంతి బరిలో నా సామిరంగ గట్టి పోటీ ఇవ్వడం ఖాయంగా ఉంది. ఆస్కార్ విన్నర్ కీరవాణి మ్యూజిక్ అందించారు. నా సామిరంగ చిత్రానికి విజయ్ బిన్నీ దర్శకుడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ పతాకం పై శ్రీనివాస్ చిట్టూరి నిర్మిస్తున్నారు.