Naa Saami Ranga Teaser: నా సామిరంగ టీజర్ రివ్యూ… నాగార్జున ఊరమాస్ పెర్ఫార్మన్స్, పక్కా సంక్రాంతి మెటీరియల్!

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో నా సామిరంగ టీజర్ ప్రదర్శించనున్నారని సమాచారం. ఇక నేడు విడుదలైన టీజర్ గమనిస్తే... విలేజ్ మాస్ యాక్షన్ డ్రామా అని తెలుస్తుంది.

Written By: NARESH, Updated On : December 17, 2023 4:09 pm

Naa Saami Ranga Teaser

Follow us on

Naa Saami Ranga Teaser: కింగ్ నాగార్జున సోలోగా హిట్ కొట్టి చాలా కాలం అవుతుంది. 2016లో విడుదలైన సోగ్గాడే చిన్ని నాయనా మంచి విజయం సాధించింది. తర్వాత చెప్పుకోదగ్గ సక్సెస్ రాలేదు. 2022లో కొడుకు నాగ చైతన్యతో కలిసి బంగార్రాజు అనే ముల్టీస్టారర్ చేశాడు. అది సోగ్గాడే చిన్ని నాయనా చిత్రానికి సీక్వెల్. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ చిత్రం విజయం సాధించింది. వైల్డ్ డాగ్, ఘోస్ట్ అంటూ యాక్షన్ ఎంటర్టైనర్స్ ట్రై చేశాడు. ఫలితం మాత్రం దక్కలేదు.

అందుకే తనకు కలిసొచ్చిన జోనర్ ఎంచుకున్నాడు. నా సామిరంగ మూవీతో బాక్సాఫీస్ బరిలో దిగుతున్నాడు. 2024 సంక్రాంతికి విడుదల చేయాలనేది మేకర్స్ ప్లాన్. ఈ క్రమంలో ప్రమోషన్స్ షురూ చేశారు. బిగ్ బాస్ వేదికపై నా సామిరంగ యూనిట్ సందడి చేస్తున్నారు. నేడు గ్రాండ్ ఫినాలే కాగా అల్లరి నరేష్, రాజ్ తరుణ్ ఎంట్రీ ఇచ్చారు. వీరిద్దరూ నా సామిరంగ చిత్రంలో కీలక రోల్స్ చేస్తున్నారు.

బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలేలో నా సామిరంగ టీజర్ ప్రదర్శించనున్నారని సమాచారం. ఇక నేడు విడుదలైన టీజర్ గమనిస్తే… విలేజ్ మాస్ యాక్షన్ డ్రామా అని తెలుస్తుంది. నాగార్జున లుక్, క్యారెక్టరైజేషన్ అద్భుతంగా ఉన్నాయి. హీరోయిన్ ఆషికా రంగనాథ్ క్యారెక్టర్ కూడా విభిన్నంగా డిజైన్ చేశారు. రెగ్యులర్ హీరోయిన్ లా ఆమె పాత్ర లేదు. అల్లరి నరేష్ ఈ మూవీలో ప్రధాన ఆకర్షణ కానున్నారు. రాజ్ తరుణ్ కూడా విలేజ్ కుర్రాడి రోల్ లో అలరించనున్నాడు.

నా సామిరంగ చిత్రానికి విజయ్ బిన్నీ దర్శకుడు. ఈ చిత్రంలో మిర్నా మీనన్, రుక్షర్ థిల్లాన్ కూడా నటిస్తున్నారు. మ్యూజిక్ ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి అందిస్తున్నారు. మొత్తంగా నా సామిరంగ టీజర్ మెప్పించింది. సినిమాపై అంచనాలు పెంచేసింది. సంక్రాంతికి విడుదలని గతంలో చెప్పిన యూనిట్, టీజర్లో డేట్ మెన్షన్ చేయలేదు. బహుశా పోస్ట్ పోన్ చేసే ఆలోచనలో ఉన్నారేమో చూడాలి…