Homeఆంధ్రప్రదేశ్‌అవినాష్ రెడ్డి.. ఆ వ్యూహం..

అవినాష్ రెడ్డి.. ఆ వ్యూహం..

MP Avinash Reddy : దేశంలో హేమాహేమీలైన నాయకులను సీబీఐ ఇటీవల అదుపులోకి తీసుకుంది. కేవలం మర్యాదపూర్వకంగా అన్నట్టు సీబీఐ అధికారులతో కలిసి సదరు నాయకులు వెళ్లిపోయారు. చట్టాలు, వ్యవస్థలపై గౌరవం ఉన్నవారు అట్లాగే వ్యవహరిస్తారు.  ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాతో పాటు లిక్కర్ స్కాంలో అరెస్టయిన వారు ఇదే రీతిని వ్యవహరించారు. అత్యున్నత దర్యాప్తు సంస్థకు మర్యాద ఇచ్చారు. అయితే ఏపీలో మాత్రం సీబీఐ పప్పులుడకడం లేదు. వైఎస్ సొంతింటి కేసు కావడంతో మేము అలా ఒప్పుకోమన్నట్టుంది వ్యవహారం. గత కొద్దిరోజులుగా కర్నూలు విశ్వభారతి ఆస్పత్రి వద్ద నడుస్తున్న ఎపిసోడ్ కశ్మీరు ఉగ్రవాద యుద్ధ తంత్రాన్ని గుర్తుచేస్తోంది.

విచారణ పేరిట తనను పిలిచి సీబీఐ అరెస్ట్ చేస్తుందని తెలిసి అవినాష్ వ్యూహాలు మార్చుకుంటూ వస్తున్నారు. ఈ నెల 19న హైదరాబాద్ వచ్చినట్టే వచ్చి తల్లికి అనారోగ్యమని చెప్పి యూటర్న్ తీసుకున్నారు. పరిస్థితి విషమించిందని చెప్పి హైదరాబాద్, బెంగళూరు తీసుకెళతామని.. అక్కడే వైద్య చికిత్సలు అందిస్తామని ప్రచారం చేశారు. కానీ ముందస్తు వ్యూహం మేరకు కర్నూలులోని సొంతవారి ఆస్పత్రికి తీసుకెళ్లారు. కడప సైన్యాన్ని తెచ్చి మరీ కాపలా పెట్టుకున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన నేతలందర్నీ మొహరింపజేశారు. బయట వారికి లోపలికి వెళ్లకుండా ఎక్కడికక్కడే నిర్బంధ వ్యూహాన్ని పన్నారు.

అయితే కర్నూలులో ఫ్యాక్షన్ ఎపిసోడ్ కు కశ్మీరు ఉగ్రవాద తంత్రాన్ని జత కలిపారు. సాధారణంగా చివరి వ్యూహంలో భాగంగా ఉగ్రవాదు ఓ భవనంలో దాక్కుంటారు. వారి వద్ద పెద్ద ఎత్తున ఆయుధాలు ఉంటాయి. ఆ భవనం దగ్గరకు వెళ్లడానికి.. అందులో ఉన్న ఉగ్రవాదుల్ని పట్టుకోవడానికి బలగాలు చాలా రిస్క్ తీసుకుంటాయి. ఓ భవనంలో ఉగ్రవాదులు ఎలా దాక్కుంటారు ? అక్కడే అసలు విషయం ఉంది. ఇక ఏ దారి లేనప్పుడు ఇలా ఓ భవనాన్ని అడ్డాగా చేసుకుని అందులో దాక్కుంటే..అక్కడకు రావడానికి ఎవరైనా భయపడాల్సిందే. చాన్స్ దొరికితే.. అందులో ఉన్న వారిని సమిధులుగా మార్చి తప్పుకోవడానికి ప్రయత్నిస్తారు.

మొత్తానికైతే ఈ ఎపిసోడ్ తో విశ్వభారతి ఆస్పత్రి బహుళ ప్రాచుర్యంలోకి వచ్చింది. ఆస్పత్రిని షెల్టర్ గా చేసుకొని ఏకంగా సీబీఐతోనే గేమ్స్ ఆడుతున్నారు. ఏపీ పోలీసులు ఎలాగూ నిర్వీర్యం అయిపోయారు. సీబీఐకి సహకరించేందుకు కూడా అధికారులు ఆసక్తి చూపలేదు. శాంతి భద్రతలను కాపాడతామనే గ్యారంటీ ఇవ్వలేదు. ఇక ఆస్పత్రిలో ఉన్న అవినాష్ రెడ్డి బయటకు రావడ లేదు. వచ్చినా ఆయన చుట్టూ కనీసం రెండు వందల మంది ఉండేలా చూసుకుంటున్నారు. ఈ వ్యూహం చూసిన పోలీసు అధికారుల మైండ్ కూడా బ్లాంక్ అయిపోయింది.  ప్రభుత్వ పెద్దలే అండగా ఉండటంతో స్థానిక పోలీసులు నిరీర్వం అయిపోయారు. కానీ తాము చేస్తున్న పనిపై ఆ డిపార్టుమెంట్‌లోనే ఎక్కువ మంది సిగ్గుపడుతున్నారు.అవినాష్ రెడ్డి అండ్ గ్యాంగ్ వేస్తున్న ఈ ఉగ్రవాదుల వ్యూహాన్ని సీబీఐ అధికారులు ఎలా చేదిస్తారన్నది ఇప్పుడు కీలకంగా మారింది.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
RELATED ARTICLES

Most Popular