https://oktelugu.com/

టీవీ, ఫ్రిజ్ ఉన్నవారికి షాక్.. రేషన్ కార్డు రద్దయ్యే ఛాన్స్..?

కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుని టీవీ, ఫ్రిజ్, బైక్ ఉన్నవాళ్లకు భారీ షాక్ ఇచ్చింది. ఎవరైతే టీవీ, ఫ్రిజ్, బైక్ లాంటివి కలిగి ఉంటారో వారు స్వచ్చందంగా రేషన్ కార్డును వదులుకోవాలని సూచించింది. రేషన్ కార్డును వదులుకోని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కర్ణాటక రాష్ట్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖా మంత్రి ఉమేశ్ కత్తి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. Also […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 15, 2021 / 07:28 PM IST
    Follow us on

    కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రేషన్ కార్డులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుని టీవీ, ఫ్రిజ్, బైక్ ఉన్నవాళ్లకు భారీ షాక్ ఇచ్చింది. ఎవరైతే టీవీ, ఫ్రిజ్, బైక్ లాంటివి కలిగి ఉంటారో వారు స్వచ్చందంగా రేషన్ కార్డును వదులుకోవాలని సూచించింది. రేషన్ కార్డును వదులుకోని పక్షంలో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కర్ణాటక రాష్ట్ర ఆహార, ప్రజా పంపిణీ శాఖా మంత్రి ఉమేశ్ కత్తి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు.

    Also Read: ఎల్‌ఐసీ బెస్ట్ పాలసీ.. రోజుకు రూ.64తో చేతికి రూ.13 లక్షలు..?

    టీవీ, ఫ్రిజ్, బైక్ లాంటి వస్తులను కలిగి ఉన్నవారు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే రేషన్ ను తీసుకోవడానికి అర్హులు కాదని పేర్కొన్నారు. మంత్రి మాట్లాడుతూ ఎవరైనా రేషన్ కార్డును పొందాలంటే కొన్ని నిబంధనలు, పరిమితులు ఉంటాయని తెలిపారు. రేషన్ కార్డు ఉన్నవారికి ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉండకూడదని టీవీ, ఫ్రిజ్, బైక్ ఉండకూడదని పొలం ఎక్కువువున్నా టీవీ, ఫ్రిజ్, బైక్ లను కలిగి ఉన్నా మార్చి 31లోగా రేషన్ కార్డ్ వెనక్కు ఇచ్చేయాలి.

    Also Read: బిర్యానీతో రూ.200 కోట్ల వ్యాపారం చేస్తున్న మహిళ.. ఎలా అంటే..?

    1,20,000 రూపాయల కంటే ఎక్కువ ఆదాయం ఉన్నా రేషన్ కార్డును కలిగి ఉండటానికి అర్హులు కాదని ప్రభుత్వం పేర్కొంది. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగెస్ పార్టీ నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. కాంగ్రెస్ కార్యకర్తలు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా రేషన్ దుకాణాలకు ముందు ఆందోళన నిర్వహించారు.

    మరిన్ని వార్తలు కోసం: ప్రత్యేకం

    కాంగ్రెస్ పార్టీ నేతలు మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రస్తుతం టీవీ, ఫ్రిజ్ నిత్యావసర వస్తువులు అయ్యాయని.. అలాంటి వస్తువులు కలిగి ఉన్నంత మాత్రాన రేషన్ ను తొలగించడం సరికాదని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వం ప్రజలకు వ్యతిరేకంగా పని చేస్తుందని పేర్కొన్నారు.