ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ మొదటి ఇంటర్వ్యూతోనే సంచలనం సృష్టించారు.‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’ అంటూ తన ప్రత్యర్థి వైఎస్ఆర్ కూతురు, ఏపీ సీఎం జగన్ చెల్లెలు వైఎస్ షర్మిలతో ఇంటర్వ్యూ నిర్వహించి కాకరేపారు. ఇప్పుడు రెండో ఇంటర్వ్యూగా మోహన్ బాబును ఎంచుకున్నారు. అసలే ఫైర్ బ్రాండ్ మోహన్ బాబు.. ఇటు వైపు ఆర్కే .. సో ఈ ఇంటర్వ్యూ సీమ టపాకయాల పేలింది. ఈ మేరకు విడుదల చేసిన ప్రోమో వైరల్ అవుతోంది.

ఫైర్ బ్రాండ్ మోహన్ బాబు ఎందుకిలా సైలెంట్ అయ్యాడని ఏబీఎన్ ఆర్కే తన ఇంటర్వ్యూలో మోహన్ బాబును ప్రశ్నించారు. మోహన్ బాబు మౌనం వెనుక కారణాలను అడిగి తెలుసుకున్నారు. దీనికి ‘మాడు పలిగిపోయిందని’ మోహన్ బాబు తన మౌనం వెనుక కారణాన్ని తాజాగా ప్రోమోలో బయటపెట్టారు. అది ఎందుకు పగిలిందన్నది మనం ఆదివారం 8.30కి ప్రసారమయ్యే షోలో చూడాల్సిందే.
తాను ప్రశాంతంగా హ్యాపీగా నవ్వలేకపోతున్నానని మోహన్ బాబు చెప్పుకొచ్చారు. దీనికి సినిమా జీవితం కారణం కాదని.. వేరే కారణాలున్నాయన్నట్టుగా మోహన్ బాబు హింట్ ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్ లో మీరు కోరిన.. మీ దగ్గరి బంధువైన సీఎం జగన్ సీఎం అయ్యాడు కదా.. మీకు కనీసం టీటీడీ చైర్మన్ పదవి దక్కలేదు.. తీరా కాలేజీ సమస్యలపై గుక్కపెట్టి ఏడుస్తున్నారని.. మీ స్పందన ఏంటని ఆర్కే తెలివిగా జగన్ పై ప్రశ్నను మోహన్ బాబుకు సంధించాడు.దీనికి మోహన్ బాబు ఠంగ్ స్లిప్ కాలేదు. జగన్ కు, నాకు గొడవలు పెడుతున్నావా? అంటూ ఆర్కేనే బెదిరించారు.
చంద్రబాబు టైంలో కాలేజీ ఫీజులపై రోడ్డు ఎక్కిన మోహన్ బాబు ఇప్పుడు ఎందుకు జగన్ హయాంలో మాట్లాడడం లేదని ఆర్కే అడగగా మోహన్ బాబు ఫైర్ అయ్యారు.. ‘నువ్వు చంద్రబాబు మనిషివా?’ అంటూ లేచారు. చంద్రబాబు నాకు సంబంధం లేదని.. జగన్ కు నాకు గట్టు పంచాయతీ లేదని ఆర్కే వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. మోహన్ బాబు అలా రెచ్చిపోవడంతో రెండు చేతులు ఎత్తి వదిలేయండని రాధాకృష్ణనే చేతులు ఎత్తి మొక్కించిన పరిస్థితి ఏర్పడింది.
మా ఎన్నికలు నీచ నికృష్టం చండాలంగా తయారయ్యాయని మోహన్ బాబు తిట్టిపోశారు. బయట అసెంబ్లీ ఎన్నికల కంటే దారుణంగా తయారయ్యాయని ఆర్కే, మోహన్ బాబు మాట్లాడుకున్నారు. రోడ్డున పడి కోట్టుకోవడం సిగ్గేయడం లేదా? అన్న ప్రశ్నకు మోహన్ బాబు స్పందించారు. ‘దాసరి నారాయణ రావు తర్వాత సినిమా ఇండస్ట్రీని కంట్రోల్ చేసే పెద్ద దిక్కు లేకుండా పోయింది’ అని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేశాడు. మా ఎన్నికల్లో ఖచ్చితంగా మంచు విష్ణు గెలుస్తాడని చెప్పుకొచ్చాడు.
ఇక చిరంజీవి ఉన్నాడు కదా.. అని ఆర్కే ప్రశ్నించగా.. అసలు చిరంజీవికి నాకు పుల్లలు పెట్టించకండి అంటూ సమాధానం చెప్పకుండా మోహన్ బాబు దండం పెట్టేశారు.
- మోహన్ బాబుతో ఏబీఎన్ ఆర్కే ఇంటర్వ్యూ ప్రోమో