Samantha: ఏ మాయ చేశావె సినిమాతో తెరంగేట్రం చేసిన సమంత దక్షిణాది భాషల్లో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే సమంత పలు విభిన్న పాత్రలు చేసి ప్రేక్షకుల మనసు దోచుకుంది. ఆమె కెరీర్ లో దాదాపు అన్ని హిట్లే. సంచలనాల విజయాలు దక్కించుకున్న ఆమె మరో సంచలనం సృష్టించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. తన కెరీర్ లో అద్భుతమైన విజయాలు సొంతం చేసుకుంటూ తన పాత్రకు న్యాయం చేస్తున్న సమంత ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో తనకంటూ ఓ ప్రత్యేకతను చాటుకుంది.
సమంత తొలిసారిగా శాకుంతలం అనే ఓ పౌరాణిక చిత్రం ద్వారా తన ప్రతిభను చాటుకోవాలని భావిస్తోంది. గుణశేఖర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా దాదాపు పూర్తయింది. కాళిదాసు రచించిన నాటకం ద్వారా తెరకెక్కించే ఈ చిత్రంలో సమంత పాత్ర శకుంతలగా తెలుస్తోంది. దీంతో సమంత తన నటన ద్వారా ప్రేక్షకులను మరోసారి రంజింపచేసి తన కీర్తిని చాటుకోవాలని చూస్తోంది.
అక్కినేని నాగచైతన్యను పెళ్లిచేసుకుని జీవితంలో స్థిరపడాలని భావించింది. కానీ వారి మధ్య అభిప్రాయభేదాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవల సామాజిక మాధ్యమ ఖాతాలో అక్కినేని పేరు తొలగించడంతో అందరిలో అనుమానాలు పెరిగిపోయాయి. లవ్ స్టోరీ సక్సెస్ మీట్ లో ఆమె కనిపించకపోవడంతో అందరి అంచనాలు కరెక్టే అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో హీరోయిన్ గా నటిస్తూనే ఆహా ఓటీటీ ప్లాట్ ఫాం లో యాంకర్ గా చేస్తోంది.
అయితే ఈ కథనంతో తెలుగులో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. ఇందులో ఎన్టీఆర్ హీరోగా నటించిన శకుంతల. ఇందులో సరోజా దేవి హీరోయిన్ గా చేసింది. కమలాకర కామేశ్వర రావు దర్శకుడు. ఎన్టీఆర్ దర్శకత్వంలోనే బ్రహ్మర్షి విశ్వామిత్ర వచ్చింది. ఇందులో భాలకృష్ణ దుష్యంతుడిగా నటించారు. ఈ రెండు సినిమాలు ప్రేక్షకుల అంచనాలు అందుకోలేకపోయాయి. బాక్సాఫీసు దగ్గర చతికిల పడ్డాయి. అయితే వారిద్దరికి దక్కని సక్సెస్ సమంతకు దక్కుతుందా అనేది వేచి చూడాల్సిందే.