Modi vs Pakistan : ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారంటే ఇదే కాబోలు, పాకిస్తాన్ దుస్థితి ఇలానే వుంది

పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేశారు. ఉగ్రవాదాన్ని అణిచేశారు. కశ్మీర్ లో చట్టాలు మార్చి స్వేచ్ఛనిచ్చారు. పాక్ కు సాయం అందకుండా చేసి ఆర్థికమూలాలు పెకిలించారు.

Written By: NARESH, Updated On : July 23, 2023 2:15 pm
Follow us on

Modi vs Pakistan : ఎవరు తీసుకున్న గోతిలో వాళ్ళే పడతారంటే ఇదేకాబోలు.. ఇవాళ పాకిస్తాన్ దుస్థితి ఇలానే వుంది. ఈ సామెత అతికినట్టు సరిపోతోంది. ఒకనాడు భారత్ మీదకు ఈ ఉగ్రవాదాన్ని ఎగదోసింది. 1987 నుంచి ఉధృతం చేసింది. కశ్మీర్ ను స్వాధీనం చేసుకోవాలని సరిహద్దు ఉగ్రవాదాన్ని బాగా ఎగదోసింది. ఒకనొక సమయంలో మన భద్రతా దళాలు కంట్రోల్ చేయగలవా? అన్న అనుమానాలు కూడా తలెత్తాయి. వాళ్ల ప్రయత్నాలు ఆ స్థాయికి వెళ్లిపోయాయి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి.

2014కు ముందు ప్రభుత్వాలు కశ్మీర్ లోని పార్టీలు, నేతలు, ప్రభుత్వాల విషయంలో సాఫ్ట్ కార్నర్ తీసుకున్నాయి. కశ్మీర్ నేతలకు ఎనలేని గౌరవం ఇచ్చి వారి మాటల అనుగుణంగా పాలించేవారు. చివరకు ఐఏఎస్ లను చంపి ప్రత్యక్షంగా దొరికి.. విమానాన్ని హైజెక్ చేసిన కశ్మీర్ ఉగ్రవాద సంస్థ నేత యాసిన్ మాలిక్ ను ప్రధానమంత్రి కార్యాలయంలో కూర్చుండబెట్టి సంప్రదింపులు జరిపిన దుస్థితి ఉండేది. ఆ స్థాయిలో వారికి గౌరవం ఇచ్చిన తర్వాత సమస్య ఎలా పరిష్కారం అవుతుంది.దీనివల్ల కశ్మీర్ లో ఉగ్రవాదం పెరిగిపోయింది.

దీనికి భిన్నమైన వైఖరిని మోడీ తీసుకున్నారు. 2014లో మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాడికల్ వైఖరిని కశ్మీర్ పై తీసుకున్నారు. అదివరకు ప్రభుత్వాలు తీసుకున్న వైఖరికి పూర్తి విరుద్ధంగా భిన్నమైన వైఖరిని తీసుకున్నారు. హురియత్ అనే పార్టీకి గౌరవం లేకుండా.. వాళ్లతో అసలు సంప్రదింపులే చేయనన్నారు. తీసుకెళ్లి జైల్లో పెట్టారు. జేకేఎల్ఎం ఉగ్రవాద నేత యాసిన్ మాలిక్ ను పబ్లిక్ గా అందరిముందు నడిపించుకొని తీసుకెళ్లారు. పాకిస్తాన్ ను అష్టదిగ్బంధనం చేశారు. ఉగ్రవాదాన్ని అణిచేశారు. కశ్మీర్ లో చట్టాలు మార్చి స్వేచ్ఛనిచ్చారు. పాక్ కు సాయం అందకుండా చేసి ఆర్థికమూలాలు పెకిలించారు.

దీంతో పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు రోజురోజుకు దిగజారిపోయింది. దీనిపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.