https://oktelugu.com/

PM Narendra Modi : ఒక దేశంలో పాదాభివందనం, మరో దేశంలో జనం నీరాజనాలు

ఇది ప్రపంచంలోనే అరుదైన సంఘటన.. దేశాధినేతలు ఉదారవాదులు, సంప్రదాయవాదులు, జాతీయవాదులు అయినా.. ఒక్క విషయంలో వారందరూ ఏకమవుతున్నారు. మోడీ అంటే అభిమానం చూపిస్తున్నారు. పర్యావరణ హిత చర్యలు తీసుకోవడంలో అందరికంటే మోడీ ముందున్నాడు.

Written By:
  • NARESH
  • , Updated On : May 24, 2023 / 10:46 PM IST
    Follow us on

    PM Narendra Modi : మోడీ క్రేజ్.. మోడీ మేనియా ప్రపంచవ్యాప్తంగా ఎక్కడికి వెళ్లినా కొనసాగుతోంది. పుపువా న్యూగినియా దేశ అధ్యక్షుడు పాదాభివందనంతో స్వాగతం పలికాడు. ఆస్ట్రేలియా ప్రధాని ఏకంగా బ్రూస్ కింగ్స్ టిన్ తో మోడీని పోల్చడం విశేషం. ఆస్ట్రేలియా స్టేడియంలో ఆ జనాలను చూస్తే ఆ కేరింతలు, చప్పట్లు చూస్తే మోడీకి ఎంత క్రేజ్ ఎంత అభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు.

    2014లో మోడీ భారత ప్రధాని అయ్యాక భారత ప్రతిష్ట రోజురోజుకు పెరిగిపోతోంది. భారత ప్రతిష్ట పెరగడానికి మోడీ ప్రధాని పదవి ఎంతో సహకరిస్తుందని అర్థమవుతోంది. వివిధ ప్రపంచ దేశాల అధ్యక్షులు, అగ్రదేశాల ప్రధానులు సైతం మోడీని కీర్తిస్తున్నారు. గౌరవిస్తున్నారు. రష్యాకు మోడీ అనుకూలమైనా.. ఉక్రెయిన్ అధ్యక్షుడు కూడా మోడీని గౌరవిస్తున్నాడంటే అతిశయోక్తి కాదు.

    ఇది ప్రపంచంలోనే అరుదైన సంఘటన.. దేశాధినేతలు ఉదారవాదులు, సంప్రదాయవాదులు, జాతీయవాదులు అయినా.. ఒక్క విషయంలో వారందరూ ఏకమవుతున్నారు. మోడీ అంటే అభిమానం చూపిస్తున్నారు. పర్యావరణ హిత చర్యలు తీసుకోవడంలో అందరికంటే మోడీ ముందున్నాడు.

    మహిళా సాధికారతలో మోడీ భారత్ లో చేసినంతగా ప్రపంచంలో ఏ దేశంలోనూ చేయలేదు.. ట్రాన్స్ జెండర్ల విషయంలో మోడీ ఏకంగా చట్టం తీసుకొచ్చాడు. అమెరికాలో అబార్షన్ విషయంలో కొట్టుకుంటుండగా.. భారత్ లో మోడీ అబార్షన్ విషయంలో లిబరల్ గా ఉన్నారు. మహిళల హక్కులకు బాసటా నిలిచాడు. కాబట్టే మోడీని అభిమానించడానికి చాలా కారణాలు ఉన్నాయి.

    ఆసియా పసిఫిక్ సహా ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న మోడీ ఆదరణపై ‘రామ్’ గారి సునిశిత విశ్లేషణను కింది వీడియోలో చూడొచ్చు.