Narendra Modi:: 100 ఏళ్ల కాంగ్రెస్ పార్టీ.. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కొన్ని దశాబ్ధాల పాటు భారతదేశాన్ని ఏకచత్రాధిపత్యంతో ఏలిన పార్టీ. సంకీర్ణ రాజకీయంతో ఎప్పుడు కూలిపోతుందో తెలియని అయోమయ స్థితిలో దేశాన్ని అవినీతితో భ్రష్టు పట్టించిన పార్టీ. అందుకే 2014లో ప్రజలంతా కాంగ్రెస్ కు విసుగుచెందిన బీజేపీని ఫుల్ మెజార్టీతో గెలిపించారు. క్లీన్ స్వీప్ చేశారు. 2019లోనూ అదే కథ.. మోడీ పాలన వైభవం లేకున్నా ప్రజలు కాంగ్రెస్ పై ఏహ్యాభావంతో మరోసారి ఎవరి సపోర్టు లేకుండానే మెజార్టీ సీట్లు అందించి గెలిపించారు.

రెండోసారి అధికారంలోకి వచ్చిన బీజేపీ ప్రభుత్వంలో మెరుపులు ఏం లేవు. పైగా వ్యతిరేక తెచ్చుకుంది. సీఏఏ, సాగుచట్టాలు సహా ఎన్నో వాటిపై రైతులు, ప్రజలు ఆందోళన చేసిన పరిస్థితి. కొన్నింటిని వెనక్కి తీసుకొని.. మరికొన్నింటిని హోల్డ్ చేసి మోడీ సర్కార్ నెట్టుకొస్తోంది. అయితే రెండు సార్లు గెలిచాక వచ్చిన వ్యతిరేకతతో మూడోసారి గెలవడం అంత ఈజీ కాదు.. ఆ విషయం మోడీకి కూడా తెలుసు. కానీ కాంగ్రెస్ అక్కడ బలం పుంజుకోలేదు. ప్రత్యామ్మాయంగా ఎదగడం లేదు. అందుకే మోడీలో ఆ ధీమా?.. అందుకే తాజాగా సంచలన ప్రకటన చేశారు. ‘వందేళ్లు అధికారం మాదే’నని నమ్మకంగా చెప్పాడు. అయితే కాంగ్రెస్ ను కాదని వందేళ్ల అదికారం మోడీకి సాధ్యమేనా? అన్నది ప్రశ్న.
తాజాగా ప్రధాని నరేంద్రమోడీ పార్లమెంట్ లో మాట్లాడుతుండగా కాంగ్రెస్ ఎంపీ ఆందోళనలు చేశారు. కర్ణాటకలో ‘హిజాబ్’ వివాదంపై స్పందించాలని కాంగ్రెస్ ఎంపీలు బీజేపీని నిలదీశారు. దీంతో మోడీ సహనం కోల్పోయారు. కాంగ్రెస్ కు గట్టి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ పట్ల ప్రజల్లో విశ్వాసం కోల్పోయిందని వివిధ రాష్ట్రాల్లో 1988 నుంచి ఇప్పటిదాకా గెలవలేదని రాష్ట్రాల వారీగా లెక్క తీసి మరీ మోడీ కడిగేయడం విశేషం.
1972లో పశ్చిమ బెంగాల్ లో కాంగ్రెస్ ను గెలిపించారని.. ఒడిశాలో 27 ఏళ్ల క్రితం, నాగాలాండ్ లో 24 ఏళ్ల క్రితం.. గోవాలో 28 ఏళ్ల క్రితం గెలిపించారని మోడీ కడిగేశారు.ఇక మోడీ ప్రసంగంలో ప్రధానమైన అంశం ఏంటంటే.. ఈ క్రమంలోనే తెలంగాణను ప్రస్తావించారు.
తెలంగాణను తామే ఏర్పాటు చేశామని క్రెడిట్ తీసుకున్న కాంగ్రెస్ ను తెలంగాణ ప్రజలు కూడా విశ్వసించలేదని మోడీ కడిగిపారేశారు. రాష్ట్రం ఇచ్చినా కాంగ్రెస్ ను గెలిపించలేదంటే దాని విశ్వసనీయత ఏ పాటిదో అర్థం చేసుకోవాలని మోడీ నిలదీశారు.
కరోనా సమయంలో కార్మికులను తరలించిన కాంగ్రెస్ ప్రభుత్వాలపై మోడీ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కరోనా సమయంలో ఉచిత రైలు, బస్సులు ఏర్పాటు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాల వల్ల పంజాబ్, యూపీ, ఉత్తరప్రదేశ్ లో కరోనా వ్యాప్తి పెరిగిందని మోడీ విమర్శించారు. అంటే కార్మికులను తరలింపును మోడీ తప్పు పట్టడం వివాదాస్పదమైంది.
మోడీలో ధీమా ఉంది. అలాగే ప్రజలపై నమ్మకం ఉంది. ఆయన ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నా కూడా గెలిపిస్తారన్న విశ్వాసం ఉంది. అయితే ప్రజలు ఎప్పుడూ కష్టాలు భరించరు. సార్వత్రిక ఎన్నికలకు వచ్చేసరికి కర్రుకాల్చి వాతపెడుతారు. ఇప్పటికే కరోనా కల్లోలంలో సరిగ్గా దేశాన్ని నిర్వహించలేదన్న అపవాదు మోడీపై ఉంది. పెట్రోల్, డీజిల్, నిత్యావసరాల ధరలను భారీగా పెంచి పిండుకోవడం.. భారీగా కోల్పోయిన ఉద్యోగాలు, ఉపాధిలేమి.. వలస కార్మికుల వెతలు.. ప్రజల ఆదాయాన్ని మెరుగుపరిచే చర్యలు చేపట్టకపోవడం వంటి వాటి వల్ల మోడీ సర్కార్ పై వ్యతిరేకత ఉంది. అయితే మన బ్యాడ్ లక్ ఏంటంటే.. దాన్ని క్యాష్ చేసుకునే ప్రతిపక్షం కాంగ్రెస్ అంత బలంగా లేకపోవడమే మైనస్. కాంగ్రెస్ కు కనుక సరైన నాయకుడు, నాయకత్వం ఉంటే ప్రజలు ఆ పార్టీని ఎంపిక చేసుకునే వారే. కానీ వారి అసమర్థతే మోడీకి ప్లస్ అవుతోంది. ‘వందేళ్ల అధికారం అని’ మాటలు అనేలా చేస్తోంది. మరి 2024లోనూ మోడీ గెలుస్తాడా? కాంగ్రెస్ నిలువరించి ఆ 100 ఏళ్లు అధికారంలోనే ఉంచుతాడా? అన్న దానికి కాలమే సమాధానం చెబుతోంది.

[…] Also Read: కాంగ్రెస్ ను కాదని.. వందేళ్ల అధికారం మ… […]
[…] Also Read: కాంగ్రెస్ ను కాదని.. వందేళ్ల అధికారం మ… […]