Homeజాతీయ వార్తలుMinister KTR: చంద్రబాబు + వైఎస్సార్‌ = కేసీఆర్‌..!

Minister KTR: చంద్రబాబు + వైఎస్సార్‌ = కేసీఆర్‌..!

Minister KTR: కేసీఆర్‌.. తెలంగాణ ఉద్యమ రథసారధి.. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించాడు. స్వరాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పాలనతోనూ ఆదర్శంగా నిలుస్తున్నారు. రాజకీయ చతురత, వ్యూహాల్లోనూ తనకు ఎవరూ సాటిరారని రెండుసార్లు పార్టీని అధికారంలోకి తీసుకురాగలిగారు. తెలుగుదేశం పార్టీ నుంచి రాజకీయ ఓనమాలు నేర్చుకున్న కేసీఆర్‌.. మాజీ ముఖ్యమంత్రులు నందమూరి తారకరామారావు, నారా చంద్రబాబునాయుడుతో సన్నిహిత, సత్సంబంధాలు ఉన్నాయి. కేసీఆర్‌ రాజకీయ చతురత నిషితంగా పరిశీలిస్తున్న వారు.. చంద్రబాబు నాయుడుతో పోలుస్తారు. చంద్రబాబుకు అడ్వాన్స్‌ వర్షన్‌గా కేసీఆర్‌ను పేర్కొంటారు. అయితే కేసీఆర్‌ తనయుడు, తెలంగాణ ముఖ్యమైన మంత్రి మాత్రం అందుకు అంగీకరించడం లేదు. తన తండ్రి గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు, వైఎస్సార్‌ కలిస్తే కేసీఆర్‌ అని పేర్కొన్నారు. కేసీఆర్‌ ఇప్పటికి తన పాలనలో ట్రైలరే చూపించారని.. అసలు సినిమా ముందు ఉంటుందని అంటున్నారు. తన తండ్రి కేటీఆర్‌ ఆలోచనలు ఇంకా అమల్లోకి రాలేదని పేర్కొంటున్నారు.

వారికి కేసీఆర్‌కు తేడా అదే..
ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రులుగా పని చేసిన చంద్రబాబు, వైఎస్‌ఆర్‌.. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ మధ్య ఉన్న తేడా ఏంటో మున్సిపల్‌ మంత్రి కేటీఆర్‌ వివరించారు. చంద్రబాబు ఐటీ, బిజినెస్‌ రంగాలను ముందుకు నడిపించారు. తనను తాను ఒక సీఈవోగా అభివర్ణించుకునే వారన్నారు. వైఎస్సార్‌ రైతులు, సంక్షేమం, పేదలపై దృష్టి పెట్టారు. వారిద్దరూ కేవలం కొన్ని రంగాలనే ఎంచుకొని రాష్ట్రాన్ని పాలించారున్నారు. కానీ, సీఎం కేసీఆర్‌ తెలంగాణలో ఐటీ, ఫార్మా రంగాల అభివృద్దికి చర్యలు తీసుకుంటూనే.. మరోవైపు వ్యవసాయాన్ని అగ్రగామిగా నిలిపారని చెప్పుకొచ్చారు. 67 ఏళ్లలో జరగని అభివృద్ధి 9 ఏళ్లలోనే సాధ్యపడిందంటే అందుకు సీఎం కేసీఆర్‌ దార్శనికతే కారణమని తెలిపారు.

తమ గొప్ప కోసం ఎదుటి వారిని తక్కువ చేసి…
కేటీఆర్‌ కొన్ని రోజులుగా తమ పాలన గొప్పదనాన్ని, తమ తండ్రి గొప్పదనాన్ని, రాష్ట్ర అభివృద్ధి గురించి గొప్పగా చెప్పడం కోసం పోలిక చెబుతున్నారు. ఈ క్రమంలో వ్యక్తులను, రాష్ట్రాలను కించపరుస్తున్నారు. దీనిపై విమర్శలు వస్తున్నా.. కేటీఆర్‌ తగ్గడం లేదు. ఏడాదిగా ఇదే సంప్రదాయం కొనసాగిస్తున్నారు. గత సంక్రాంతి వేళ.. ఏపీలో అభివృద్ధి జరగలేదని, తెలంగాణలో బాగా అభివృద్ధి జరిగిందని చెప్పడానికి అక్కడి రోడ్లు, హైదరాబాద్‌ రోడ్లను పోల్చారు. అలాగే కరెంటు అంశం కూడా ఇక్కడ 24 గంటలు కరెంటు వస్తుందని, ఏపీలో తొమ్మిది గంటలు కూడా ఇవ్వడం లేదని ఆరోపించారు. ఇటీవల కేసీఆర్‌ అయితే తెలంగాణలో ఎకరం అమ్మితే.. ఏపీలో 100 ఎకరాలు కొనొచ్చని అన్నారు. తాజాగా కేటీఆర్, చంద్రబాబు, వైఎస్సార్‌ కంటే తన తండ్రి కేసీఆర్‌ గొప్పవాడు అని చెప్పే ప్రయత్నం చేశారు. గొప్పలు చెప్పుకోవచ్చు కానీ ఇతరుల్ని కించపరిచి.. వారితో పోల్సుకుని తాము గొప్పవారమని చెప్పుకోవడం ఏమిటన్న విమర్శలు వస్తున్నాయి.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular