BJP Master Plan In Telangana: ఉత్తర భారతంలో గట్టి పట్టున్న బీజేపీకి దక్షిణ భారత్ మాత్రం ఎప్పుడూ కొరకరాని కొయ్యనే.. కర్ణాటకలో కూడా ఆ పార్టీ బలం రోజురోజుకు కుచించుకుపోతోంది. ఈ క్రమంలోనే దక్షిణాదిలో బీజేపీ అధికారంలోకి వచ్చే రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ మాత్రమే అనడంలో ఎలాంటి సందేహం లేదు. హుజూరాబాద్ ఎన్నికల గెలుపుతో బీజేపీకి తెలంగాణపై నమ్మకం కుదిరింది. అందుకే ఇక్కడ పాగా వేయడానికి శక్తియుక్తులను కూడగట్టుకుంటోంది. పాదయాత్రల పేరుతో ప్రజాక్షేత్రంలోకి వెళుతూ ప్రజల మద్దతును పొందడానికి బీజేపీ ప్రయత్నం చేస్తోంది.

మరోవైపు కేంద్రంలో ఉన్న అధికార బలాన్ని ఉపయోగించుకొని కేసీఆర్ సర్కార్ ను టార్గెట్ చేయడానికి బీజేపీ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. బీజేపీ జాతీయ నేతలు రంగంలోకి దిగి తెలంగాణలో యాక్టివ్ గా పనిచేస్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రలో ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొని తెలంగాణ ప్రభుత్వ అవినీతిపై విరుచుకుపడ్డారు.
ఇక ఈనెల 14వ తేదీన అమిత్ షా తెలంగాణ రాష్ట్రంలో పర్యటించనున్నారు. జాతీయ నాయకుల పర్యటనలతో పాటు తెలంగాణలో ఎన్నడూ లేని విధంగా అవినీతి ఆరోపణలపై కేంద్రం విచారణ కమిటీలు వేయడం.. దర్యాప్తు చేస్తుండడంతో ఇది కేసీఆర్ ను డిఫెన్స్ లో పడేసే మూవ్ అని.. రాష్ట్ర రాజకీయాలు షేక్ అవ్వడం గ్యారెంటీ అని చర్చ సాగుతోంది.
తెలంగాణలో కేసీఆర్ సర్కార్ అమలు చేసిన పథకాల్లో అవినీతిని తవ్వితీయాలని డిసైడ్ అయ్యింది. ఈ క్రమంలోనే తొలుత మిషన్ భగీరథలో భారీ అవినీతి జరిగిందని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ ఫిర్యాదు మేరకు జల జీవన్ కమిషన్ నిర్వహించిన సర్వేతో ఇచ్చిన నివేదిక మేరకు విచారణ జరపాలని అధికారులను కేంద్రం నియమించింది. కాంగ్రెస్ పై గన్ పెట్టి కేసీఆర్ ను కాల్చే ఎత్తుగడ చేస్తోంది.
Also Read: Gadapa Gadapaku YCP: గడపగడపకు వెళ్లలేం.. అధికార వైసీపీ నాయకుల్లో వణుకు..
ఇక తెలంగాణలో ధాన్యం కొనుగోళ్లలో అవకతవకలపై ఎఫ్.సీఐ విచారణకు రెడీ అయ్యింది. దీనిపై సీబీఐని రంగంలోకి దించే ఛాన్స్ ఉంది. ఎక్కడ ఏ చిన్న అవకాశం దొరికినా కేసీఆర్ ను మూసేయడానికి కేంద్రంలోని బీజేపీ పెద్దలు రెడీ అయినట్లుగా ప్రచారం సాగుతోంది.

తెలంగాణలోని అతిపెద్ద ప్రాజెక్ట్ కాళేశ్వరం కేసీఆర్ కు ఏటీఎంలా మారిందని ఇప్పటికే బీజేపీ నేతలు ఆరోపించారు. ఈ ప్రాజెక్టుపై కూడా దర్యాప్తునకు ఆదేశిస్తే కేసీఆర్ ఇరుకునపడడం ఖాయమంటున్నారు. ఇప్పటికే కాంట్రాక్ట్ పొందిన సంస్థలపై దాడులు జరుగుతున్న వేళ టీఆర్ఎస్ నేతల కాళ్ల కిందకు నీళ్లు తెచ్చేలా కేంద్రంలోని బీజేపీ ముందుకు సాగుతోందని సమాచారం.
ప్రధాని నరేంద్రమోడీపై ఒంటికాలిపై లేస్తూ తీవ్రస్వరంగా విరుచుకుపడుతున్న కేసీఆర్ దేశంలో బీజేపీకి వ్యతిరేకంగా కూటమి కట్టే దిశగా సాగుతున్నారు. అందుకే కేసీఆర్ ను టార్గెట్ చేయడానికి వ్యూహాత్మకంగా కేంద్రప్రభుత్వం రంగం సిద్ధం చేసుకుంటోందన్న చర్చ సాగుతోంది. కేంద్ర దర్యాప్తు సంస్థలతో తెలంగాణ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నికల పోరులో కేసీఆర్ ను బలహీనం చేయాలన్న వ్యూహంలో భాగంగానే బీజేపీ ఈ ప్లాన్ రెడీ చేసినట్టు సమాచారం. మరి బీజేపీ మైండ్ గేమ్ కు కేసీఆర్ చిత్తు అవుతారా? లేక ఆ వ్యూహాలకు చెక్ పెడుతారా? అన్నది వేచిచూడాలి.
Also Read:Chandrababu To Jail: చంద్రబాబును జైలుకు పంపడం జగన్ కు సాధ్యం అవుతుందా? సవాల్లేమిటీ?