Mahesh Babu Comments On Bollywood Entry: మహేష్ చూడటానికి హాలీవుడ్ హీరోలా ఉంటాడని ఫ్యాన్స్ మురిపంగా చెప్పుకుంటారు. కానీ, మహేష్ మాత్రం కనీసం బాలీవుడ్ వైపు కూడా చూడటం లేదు. మరోపక్క, టాలీవుడ్ స్టార్ హీరోలందరూ బాలీవుడ్ ఎంట్రీ ఇస్తూ తమ ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. ఈ క్రమంలో మరి మీ ఎంట్రీ ఎప్పుడు అని మీడియా మరోసారి మహేష్ ను ప్రశ్నించింది. తన బాలీవుడ్ ఎంట్రీ పై మహేష్ ఎప్పటిలాగే ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మహేష్ మాటల్లోనే.. ‘ప్రత్యేకంగా బాలీవుడ్ ఎంట్రీ ఎందుకు ?, ప్రస్తుతం దేశవ్యాప్తంగా తెలుగు సినిమాలను చూస్తున్నారు కదా. ‘బాహుబలి’, ‘ఆర్‌ఆర్‌ఆర్.. ఇలా పలు సౌత్ చిత్రాలకు నార్త్ లో దక్కిన ఆదరణకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఇక నా సినిమాల విషయానికి వస్తే.. నాకు బాలీవుడ్ లో ఎప్పటి నుంచో ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి.
కానీ, (అని సరదాగా నవ్వుతూ..) వాళ్లు నన్ను భరించలేరనుకుంటున్నాను. అందుకే నేను అక్కడికి వెళ్లి.. నా టైమ్ ను వృథా చేసుకోవడం నాకు ఇష్టం లేదు. తెలుగు చిత్రసీమలో నాకు లభిస్తోన్న ప్రేమాభిమానాలు అద్భుతమైనవి, అమితమైనవి. వాటిని వదిలి వేరే పరిశ్రమకు వెళ్లాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. అనుకోను కూడా. ఎందుకంటే తెలుగు సినిమాలే నా బలం. నేను తెలుగులోనే సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. కాకపోతే.. నా సినిమాలకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకుల్ని అలరించాలని, అందరూ నా సినిమాలను చూడాలని నేను ఆశ పడుతున్నాను, ఆశిస్తున్నాను’ అని మహేష్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Also Read: Pawan Kalyan: పవన్ సినిమా షూటింగ్ క్యాన్సిల్ అయితే అన్ని లక్షల నష్టమా?
ఇక ‘సర్కారు వారి పాట’ పై కూడా మహేష్ ఎక్స్ క్లూజివ్ కామెంట్స్ చేశారు. ఈ సినిమాతో సూపర్ హిట్ కొట్టబోతున్నాం. కరోనా టైంలో ఎన్నో కష్టాలు పడి మేము ఈ సినిమా షూటింగ్ చేశాం. ఎడిటింగ్ రూమ్స్ నుంచి వచ్చే రెస్పాన్స్, తమన్ మ్యూజిక్, ట్రైలర్ కు వస్తున్న స్పందన చూస్తుంటే.. నాకు చాలా ఆనందంగా ఉంది. ఫస్టాఫ్‌లో 45 నిమిషాలు థియేటర్ ఊగిపోద్ది. కీర్తి సురేష్, నాకు మధ్య ట్రాక్ అద్భుతం’ అని మహేష్ అన్నారు.
ఇటు ఈ సినిమా పై ఇండస్ట్రీ సర్కిల్స్ లో కూడా పాజిటివ్ టాక్ ఉంది. సెన్స్ బుల్ సినిమాల దర్శకుడిగా పరశురామ్ కి మంచి పేరు ఉండటం, పైగా ఇప్పటివరకు షూట్ చేసిన ఫుటేజ్ బాగా రావడంతో మొత్తానికి మేకర్స్ సినిమా పట్ల గట్టి నమ్మకంతో ఉన్నారు. అందుకే బడ్జెట్ పెరుగుతున్నా.. డైరెక్టర్ కోరిన ప్రతిదీ ఇవ్వడానికి నిర్మాతలు మొదటి నుంచి ఇంట్రెస్ట్ గా ఉన్నారు.
ఇక ఈ సినిమాలో పాటలు అన్నీ అద్భుతంగా వచ్చాయట. తమన్ ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నాడు, కాబట్టి పాటల పై భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. మరి ఈ సినిమా నుంచి రాబోతున్న సాంగ్స్ ఇక ఏ స్థాయిలో ఉంటుందో చూడాలి. ఏది ఏమైనా ఈ సినిమా పై ఇండస్ట్రీ సర్కిల్స్ లో కూడా పాజిటివ్ టాక్ ఉంది. ఈ సినిమా భారత బ్యాంకింగ్ రంగాన్ని కదిలించిన భారీ కుంభకోణాల చుట్టూ సాగుతుంది.
Also Read:Ram Charan: నడిరోడ్డుపై రామ్ చరణ్ వీరంగం.. ట్రాఫిక్ పోలీస్ తో గొడవ
Recommend Videos