Okkadu Re Release: రీ రిలీజ్ ట్రెండ్ లో భాగంగా సూపర్ స్టార్ మహేష్ బాబు హీరో గా నటించిన బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం ఒక్కడు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది..మహేష్ బాబు ని స్టార్ హీరో గా మార్చిన ఈ చిత్రం విడుదలై నేటికీ 20 ఏళ్ళు పూర్తి అయ్యాయి..తెలుగు కమర్షియల్ సినిమాని సరికొత్త పంథాలోకి తీసుకెళ్లిన చిత్రం ఇది..అలాంటి సినిమా రీ రిలీజ్ అవుతుంది అంటే కచ్చితంగా అభిమానుల్లో కలెక్షన్స్ పరంగా భారీ అంచనాలు ఉండడం సహజం.

కానీ ఈ సినిమా వసూళ్లు అభిమానులను ట్రేడ్ ని చాలా తీవ్రంగా నిరాశపరిచింది..డిసెంబర్ 31 వ తేదీన విడుదలైన ఖుషి చిత్రం మొదటి రోజు నాలుగు కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబడితే, రెండవ రోజు కోటి 60 లక్షల రూపాయిలు వచ్చాయి..కానీ ఒక్కడు సినిమాకి ఖుషి రెండవ రోజు వసూళ్లు కూడా మొదటి రోజు వచ్చే సూచనలు కనిపించలేదు.
మహేష్ బాబు కి చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉండే సిటీస్ లో కూడా ఈ చిత్రానికి ఓపెనింగ్ చాలా నార్మల్ గానే వచ్చాయి..మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకి మొదటి రోజు కేవలం కోటి 40 లక్షల రూపాయిలు మాత్రమే వస్తుందని ట్రేడ్ వర్గాలు..ఇక సీడెడ్ లో అయితే ఈ సినిమాకి వచ్చిన ఓపెనింగ్స్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది.

కడప, కర్నూల్ వంటి ప్రాంతాలలో కూడా థియేటర్స్ సగం కూడా నిండలేదు..ఎదో డిజాస్టర్ సినిమా విడుదలైతే ఎలా ఉంటుందో..ఆ రేంజ్ లో ఈ సినిమా వసూళ్లు ఉన్నాయి..ఒక్కడు లాంటి పాత్ బ్రేకింగ్ మూవీ కి ఇలాంటి అవమానం జరగడం బాధాకరమని అంటున్నారు ట్రేడ్ పండితులు..ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ఇలాగే రాత్రి వరకు కొనసాగితే ఈ చిత్రం కనీసం పోకిరి (1.74) స్పెషల్ షోస్ గ్రాస్ రికార్డుని కూడా దాటేలాగా అనిపించడం లేదు.