https://oktelugu.com/

రోజుకు రూ.195 ఆదా చేస్తే కొత్త కారు.. ఎలా అంటే..?

మీరు కొత్త కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా..? బడ్జెట్ ధరలో తక్కువ ఈఎంఐ చెల్లించి కారును కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా..? అయితే మారుతీ ఎస్ ప్రెసో కారు మీరు కొనుగోలు చేయడానికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. మారుతీ సుజుకీ ప్రతి సంవత్సరం ఎన్నో కొత్త మోడళ్లను అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది మార్కెట్ లోకి వచ్చిన మారుతీ ఎస్ ప్రెసో కారు బేస్ వేరియంట్ ధర రూ. 3.7 లక్షలుగా ఉంది. రోజుకు 195 […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : February 7, 2021 / 11:58 AM IST
    Follow us on

    మీరు కొత్త కారును కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా..? బడ్జెట్ ధరలో తక్కువ ఈఎంఐ చెల్లించి కారును కొనుగోలు చేయాలని అనుకుంటున్నారా..? అయితే మారుతీ ఎస్ ప్రెసో కారు మీరు కొనుగోలు చేయడానికి బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. మారుతీ సుజుకీ ప్రతి సంవత్సరం ఎన్నో కొత్త మోడళ్లను అందుబాటులోకి తెస్తున్న సంగతి తెలిసిందే. గతేడాది మార్కెట్ లోకి వచ్చిన మారుతీ ఎస్ ప్రెసో కారు బేస్ వేరియంట్ ధర రూ. 3.7 లక్షలుగా ఉంది.

    రోజుకు 195 రూపాయలు ఆదాయం చేయడం ద్వారా నెలకు 5,800 రూపాయలు ఈఎంఐ చెల్లించి ఈ కారును కొనుగోలు చేయవచ్చు. కనీసం 25,000 రూపాయల డౌన్ పేమెంట్ ను చెల్లించడం ద్వారా ఈ కారును కొనుగోలు చేయడం సాధ్యమవుతుంది. ఏడేళ్ల వరకు లోన్ టెన్యూర్ ను ఎంచుకుంటే ఈ మొత్తంతో కారును కొనుగోలు చేయడం సాధ్యమవుతుంది. లోన్ టెన్యూర్ ను తగ్గించుకుంటే ఎక్కువ మొత్తం ఈఎంఐ చెల్లించాల్సి ఉంటుంది.

    లోన్ టెన్యూర్ ను తగ్గించుకోవడం వల్ల వడ్డీ భారాన్ని కూడా తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. మరోవైపు ఈ కారు కొనుగోలుపై మరుతీ సుజుకీ సంస్థ 49 వేల రూపాయల వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందే అవకాశం కూడా కల్పిస్తోంది. ఈ కారుపై కన్సూమర్ ఆఫర్ కింద 25 వేల రూపాయలు, ఎక్స్చేంజ్ బోనస్ కింద 20 వేల రూపాయలు, కార్పొరేట్ డిస్కౌంట్ కింద 4 వేల రూపాయల వరకు తగ్గింపు ప్రయోజనాలను పొందవచ్చు.

    సమీపంలోని మారుతి సుజుకీ షోరూంను సంప్రదించి కారుకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. కారు కొనుగోలు చేయడానికి బ్యాంక్ నుంచి తీసుకున్న రుణానికి 10 శాతం వడ్డీ చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది.