Homeఅంతర్జాతీయంRussia- Ukraine War: యుద్ధ ఖైదీలను మరీ ఇలా హింసిస్తారా... రష్యా, నీకు ఇది తగునా!

Russia- Ukraine War: యుద్ధ ఖైదీలను మరీ ఇలా హింసిస్తారా… రష్యా, నీకు ఇది తగునా!

Russia- Ukraine War: యుద్ధోన్మాదంతో చెలరేగిపోతున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్ ‘ఉక్రెయిన్’ను శవాల దుబ్బగా మారుస్తున్నాడు. రష్యాతో పోరాడి పట్టుబడిన ఉక్రెయిన్ సైనికులను నరకం అంటే ఏంటో చూపిస్తున్నారు. తాజాగా రష్యా దళాలకు చిక్కిన ఓ ఉక్రెయిన్ సైనికుడి రూపం చూసి ప్రపంచమే షాక్ అయ్యింది. అతడి చేయి విరిచేసి.. ఎముకల గూడుగా మార్చేసి చిత్రహింసలు పెట్టినట్టుగా రూపం ఉంది. ఎముకలు తప్ప ఏం లేని అస్తిపంజరంగా ఉక్రెయిన్ సైనికుడు కనిపిస్తున్నాడు.. యుద్ధ ఖైదీలను ఏం చేయవద్దన్న ‘జెనీవా’ ఒప్పందాలను తుంగలో తొక్కి రష్యా చేస్తున్న ఈ మారణఖండకు అంతే లేకుండా పోతోంది. ప్రపంచమంతా రష్యాపై దుమ్మెత్తి పోస్తున్న ఆ దేశం ఇంకా ఉక్రెయిన్ నుంచి వెనక్కి తగ్గడం లేదు.

Russia- Ukraine War
Mykhailo Dianov

ఉక్రెయిన్ లోని మారియుపోల్ ముట్టడి సమయంలో రష్యా సైనికుల చేతికి ఈ ఉక్రేనియన్ సైనికుడు చిక్కాడు. అప్పటి నుంచి రష్యన్ జైలులో చిత్రహింసలు అనుభవించాడు. ఈ సంవత్సరం ప్రారంభంలో మారియుపోల్‌లోని అజోవ్‌స్టల్ స్టీల్ వర్క్స్‌ను రక్షించడానికి ఉక్రెయిన్ సైన్యం తరుఫున ఇతడు పోరాడాడు. అప్పుడు రష్యా సైనికుల చేతికి చిక్కాడు. బుధవారం రాత్రి విడుదలైన 205 మంది ఉక్రేనియన్ యుద్ధ ఖైదీలలో మైఖైలో డయానోవ్ కూడా ఒకరు. అతడు యుద్ధానికి ముందున్న రూపం.. ఇప్పటి రూపం చూసి అంతా షాక్ అవుతున్న పరిస్థితి.

మేలో ఓడరేవు నగరంలోని పారిశ్రామిక ప్రదేశాన్ని రష్యా ముట్టడించిన సమయంలో తన చేయితో శాంతి చిహ్నాన్ని మెరుస్తున్న ఫోటో వైరల్ అయింది. అందులో అతను అలసిపోయి, షేవ్ చేయని స్థితిలో ఉన్నాడు. కానీ డయానోవ్ తాజా ఫోటో చూస్తే అతని చేయి విరిగిపోయి.. ముఖంపై గాయాలు, మచ్చలతో కప్పబడి కృంగి కృశించినట్లు చూపిస్తుంది.

అజోజ్ మిలిటరీ యూనిట్‌లో సైనికుడు అయిన డయానోవ్ మారియుపోల్ యుద్ధంలో రష్యా సైనికుల చేతికి చిక్కాడు. నాలుగు నెలలు రష్యన్ జైలులో శిక్ష అనుభవించాడు. నరకం చూపించారు. అతడి చేయి విరిచేసి.. చిత్రహింసలు పెట్టి.. తిండి పెట్టకుండా కృంగి కృశించిపోయేలా చేశారు. కరడుగట్టిన రష్యన్ మద్దతుదారులు వీరిని యుద్ధ నేరస్థులు.. నాజీలు అని ఆరోపిస్తూ ఉరితీయాలని డిమాండ్ చేశారు.

ఈ వారం ప్రధాన ఖైదీల మార్పిడిలో భాగంగా విడుదలైన డయానోవ్ కూడా విడుదలయ్యాడు. ఆ తర్వాత తన స్నేహితులు మరియు బంధువులతో కలిసి చెర్నిహివ్‌లోని ఒక నగర ఆసుపత్రిలో బిక్కచచ్చిపోయిన దశలో చేరాడు. అతను కైవ్ మిలిటరీ ఆసుపత్రికి తరలించబడ్డాడు. అక్కడ అతని సోదరి తీవ్రమైన పరిస్థితిలో ఉన్న డయనోవ్ ను చూసి కన్నీళ్ల పర్యంతం అయ్యింది. అతడి శరీరంలోని ఎముకలన్నీ విరిగిపోయాయని.. దీర్ఘకాలిక చికిత్స అవసరమని వైద్యులు తెలిపారు.

Russia- Ukraine War
Mykhailo Dianov

గాయపడిన డయనోవ్ చేతిలోని ష్రాప్నెల్ ఎముకను కొంచెం విరిచేసి మత్తుమందు లేకుండా తీసేశారు. బందిఖానాలో అతను ఎదుర్కొన్న అమానవీయ పరిస్థితుల కారణంగా చేయి నయం కాలేదు. అతడికి 4 సెంటీమీటర్ల ఎముక లేదు అని గుర్తించారు. “మిలిటరీ హాస్పిటల్‌లోని డాక్టర్ అతనిని పరిశీలించారు. వారు అతనికి ఇంకా ఆపరేషన్ చేయబోవడం లేదు. అతను మొదట కొంచెం బరువు పెరగాలి” అని ఆమె ఉక్రేనియన్ మీడియాతో అన్నారు. అతడున్న పరిస్థితిలో అతనికి ఆపరేషన్ చేయలేమని… ఇది అతని ఆరోగ్యానికి ప్రమాదకరమని.. కాబట్టి అతను ఇప్పుడు కోలుకుని బలాన్ని పొందాలని తెలిపారు. “అతని శారీరక పరిస్థితి తీవ్రంగా ఉంది, మానసికంగా మైఖైలో చాలా బలంగా ఉన్నాడు. అతను తిరిగి వచ్చినందుకు చాలా సంతోషంగా ఉన్నాడు. కానీ జీవచ్ఛవంలా మారిపోయాడు. అతడని చిత్రహింసలు పెట్టినట్టు తెలుస్తోంది. అతడి పాత రూపానికి.. ఇప్పటి రూపానికి పొంతనే లేకుండా ఉంది.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version